stuntman Mohanraju death : స్టార్ డైరెక్టర్ పా రంజిత్, హీరో ఆర్య కాంబోలో వస్తున్న మూవీ వేట్టువం. ఈ మూవీని భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్ సీన్లతో తీస్తున్నారు. మూవీ యాక్షన్ సీన్లు తీసేటప్పుడు స్టంట్ మ్యాన్ రాజు చనిపోవడం సంచలనం రేపింది. దీనిపై తాజాగా డైరెక్టర్ రంజిత్ స్పందించారు. ఇందులో తమ తప్పేం లేదన్నారు. ఈ మేరకు సుదీర్ఘ పోస్టు వదిలారు. మేం ప్రతి రోజు మూవీ షూట్ ను అన్ని జాగ్రత్తలు తీసుకుని షూట్ చేస్తుంటాం. ప్రతి యాక్షన్ సీక్వెల్స్ లో అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తాం. ఆ రోజేఉ స్టంట్ డైరెక్టర్ దిలీప్ సుబ్బరాయన్ అన్ని జాగ్రత్తలు తీసుకుని షూట్ ను స్టార్ట్ చేశారు. స్టంట్ మ్యాన్ గా చేస్తున్న మోహన్ రాజ్ కు అలా జరిగింది.
Read Also : Nidhi Agarwal : పవన్ కల్యాణ్ పై రూమర్లు నమ్మొద్దు.. నిధి అగర్వాల్ కామెంట్స్
మేం ఎంతగానో ప్రేమించే మోహన్ కు అలా జరగిందని తెలిసి మా గుండెలు బద్దలయ్యాయి. మోహన్ ఎంతో ట్యాలెంట్ ఉన్న వ్యక్తి. స్టంట్లు చేయడంలో అతనికి తిరుగులేదు. అతని పనితనం చూసి మేం ఎంతో గర్విస్తాం. మాతో ఎన్నో ఏళ్ల జర్నీ అతనిది. అలాంటి ట్యాలెంటెడ్ స్టంట్ మ్యాన్ చనిపోయాడని తెలిసి చాలా బాధపడ్డాం. అతని కుటుంబానికి మేం ఎప్పుడూ అండగా ఉంటాం. ఇందులో మా తప్పు లేకుండానే జరిగిపోయింది. దీన్ని అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం అంటూ తెలిపారు డైరెక్టర్ రంజిత్, అతని ప్రొడక్షన్ టీమ్. తంగలాన్ లాంటి సినిమా తీసిన రంజిత్.. విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ఆర్యన్ తో ఇలాంటి సినిమానే చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. అయితే స్టంట్ మ్యాన్ మృతిపై డైరెక్టర్ మీద ఇప్పటికే కేసు నమోదైంది.
Read Also : Kiran Abbavaram : బూతులతో సినిమా.. కిరణ్ అబ్బవరం ఫ్రస్ట్రేషన్..
