NTV Telugu Site icon

Prabhas : ‘ద రింగ్స్ ఆఫ్ పవర్’లో మన తారలు!

Prabhas

Prabhas

వెండితెరపై వెలుగులు విరజిమ్మిన ‘ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్’ సినిమాకు ప్రీక్వెల్ గా ‘ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్- ద రింగ్స్ ఆఫ్ పవర్’ వెబ్ సిరీస్ రూపంలో దర్శనమిస్తోంది. ప్రస్తుతం అమేజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి శుక్రవారం ఓ కొత్త ఎపిసోడ్ తో అలరిస్తోన్న ఈ వెబ్ సిరీస్ ఇప్పటికి నాలుగు ఎపిసోడ్స్ ను జనం ముందు నిలిపింది. ‘ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్’ ఫ్యాన్స్ అందరూ ఈ వెబ్ సిరీస్ ను సైతం ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ సిరీస్ ను మన ఇండియన్ నేటివిటీలో రూపొందిస్తే ఎవరెవరు ఏ పాత్రలకు సరితూగుతారు అంటూ ఓ జాబితాను సరదాకు విడుదల చేశారు ఈ వెబ్ సిరీస్ అభిమానులు.

‘ద రింగ్స్ ఆఫ్ పవర్’లో ప్రస్తుతానికి అత్యంత కీలకంగా కనిపిస్తోన్న గలాడ్రియెల్ పాత్రకు సమంత అన్నివిధాలా సరిపోతుందని వారంటున్నారు. ఎల్రాండ్ పాత్రను ఆయుష్మాన్ ఖురానా పోషిస్తే భలేగుంటుందట! ఇందులో అత్యంత ప్రతిభావంతుడైన యోధునిగా ఇసిల్డర్ పాత్ర కనిపిస్తుంది. ఆ పాత్రకు ప్రభాస్ న్యాయం చేయగలడని వారి భావన. బ్రాన్ విన్ పాత్రలో సుష్మిత సేన్, నోరీ బ్రాండీఫుట్ పాత్రకు అనన్య పాండే న్యాయం చేయగలరనీ అంటున్నారు. ఇలా వారి అభిప్రాయాలను నెట్టింట షేర్ చేశారు. ఒకవేళ మీరు కూడా ‘ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్- ద రింగ్స్ ఆఫ్ పవర్’ చూస్తూన్నట్లయితే మీరు కూడా ఇతర పాత్రల కోసం నటీనటులను సరదాగా ఎంపిక చేసుకోవచ్చు.