NTV Telugu Site icon

2018 Movie: 2018 మూవీ ఓటిటీ క్యాన్సిల్.. ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం అదే..?

2018

2018

2018 Movie: కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడించి వదిలిపెట్టింది. ఎన్నో వేలమంది జీవనాధారాన్ని.. ఎంతమంది ప్రాణాలను.. మరెంతోమంది కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఇక ఆ సమయంలోనే ప్రజల జీవితాల్లోకి అడుగుపెట్టింది ఓటిటీ. బయటకు వెళ్లి.. సినిమాలు చూసే అవకాశం లేక .. అందరు ఇంట్లోనే ఉండాలి అన్న కట్టుబాటు.. వలన ఓటిటీ రేంజ్ పెరిగింది. ఎంతలా అంటే.. థియేటర్ కు వెళ్లడం మానేసి .. ఓటిటీలో వచ్చేవరకు ఎదురుచూసేంత. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఎక్కువ అవ్వడం వలన ఇండస్ట్రీ నాశనం అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. అలా అని ఓటిటీ తప్పు అనడం లేదు.. కానీ, దానివల్లనే చిత్ర పరిశ్రమ నాశనం అవుతుంది అంటే నిజమే అంటున్నారు.. దానికి ఉదాహరణే 2018 మూవీ. మలయాళంలో సూపర్ హిట్ సినిమాగా తెరకెక్కిన చిత్రం 2018. కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నెల రోజుల్లో దాదాపుగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది. తెలుగులో కూడా రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ముందు ముందు ఈ చిత్రం మరిన్ని కలక్షన్స్ రాబట్టగల సత్తా ఉంది. అయితే ఒక్క ఓటిటీ ప్రకటన.. కలక్షన్స్ ను మొత్తాన్ని వెనక్కి నెట్టేసింది.

Adipurush Pre Release Event: బిగ్ బ్రేకింగ్.. తిరుపతిలో భారీ వర్షం.. అయోధ్య సెట్ కు కవర్

కొన్నిరోజుల క్రితం ఈ సినిమా జూన్ 7 నుంచి సోనిలివ్ లోస్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటన వచ్చింది. అంతే.. ఆ నెక్స్ట్ డే నుంచి కలక్షన్స్ నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి. ఎలాగూ ఓటీటీ లో రెండు మూడు వారాల్లోనే వస్తుంది కనుక థియేటర్ కు వెళ్లి చూడాల్సిన అవసరం ఏంటి అంటూ ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లడం మానేస్తున్నారు. దీనివల్లనే ఇండస్ట్రీకి వసూళ్లు రాక చిత్ర పరిశ్రమ నాశనం అవుతుంది. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటీ స్ట్రీమింగ్ ఆపాలంటూ కేరళ థియేటర్ యాజమాన్యం ధర్నా చేపట్టింది. ఇలా రెండు మూడు వారాలకే సినిమాలు ఓటిటీలోకి వస్తుంటే.. ప్రేక్షకులు ఎలా థియేటర్ కు వస్తారని, వెంటనే ఆ స్ట్రీమింగ్ ను ఆపాలంటూ వారు డిమాండ్ చేశారు. కనీసం.. హిట్ అయ్యి.. కలక్షన్స్ వస్తున్న సినిమాలు అయినా ఒక 50 రోజులు ఆడేలా చూడాలని అభిమానులు సైతం చెప్పుకొస్తున్నారు. మరి ఈ చిత్రం రేపు ఓటిటీలోకి వస్తుందా..? లేదా..? అనేది చూడాలి.