Site icon NTV Telugu

OTT : ఓటీటీలో ఈ వారం బెస్ట్ మూవీస్ ఏవంటే?

Ott

Ott

ఈ ఫ్రైడే థియేటర్ల దగ్గర పెద్దగా సందడి లేదు. కాంతార చాప్టర్ వన్ తన హవాను కంటిన్యూ చేస్తోంది. ఇక ఓటీటీలోను కొన్ని సినిమాలు భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. వాటిలో తారక్- హృతిక్ రోషన్ జంటగా నటించిన ఫిల్మ్ వార్2. భారీ అంచనాల మధ్య ఆగస్టు14న కూలీతో పోటీగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఫెర్మామెన్స్ చేయలేదు. థియేట్రికల్ రన్ ముగిసినా.. కాస్త ఆలస్యంగానే ఓటీటీ బాట పట్టింది. అక్టోబర్ 9 నుండి నెట్ ఫ్లిక్స్‪లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ కన్నా ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇక హనుమాన్ తర్వాత తేజా సజ్జా నుండి వచ్చిన ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ సినిమా మిరాయ్. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిరాయ్.. నియర్లీ 150 కోట్లను కొల్లగొట్టింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ విజువల్ వండర్ అక్టోబర్ 10 నుండి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ భారీ వ్యూస్ రాబడుతోంది. ఈ రెండు సినిమాలతో పాటు తన సినిమా బాగున్నా ఎవ్వరూ చూడటం లేదంటూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు గుర్తున్నాడు కదా. మోహన్ శ్రీవాత్సవ దర్శకత్వంలో వచ్చిన త్రిబాణధారి బార్చరిక్ ఆగస్టు 29న రిలీజైంది. అక్టోబర్ 10 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్ట్స్‌లో ప్రీమియర్ అవుతోంది. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్ కీ రోల్ ప్లే చేశారు. టాలీవుడ్ నుండి ఈ మూడు సినిమాలు లేటెస్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాగా మంచి వ్యూస్ రాబడుతూ ఆయా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో టాప్ లో ట్రెండింగ్ లో దూసుకెళ్తున్నాయి.

Exit mobile version