Vijay Sethupathi’s Maharaja on Netflix: ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహారాజ’. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వచించగా.. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్‌పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు. జూన్ 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మహారాజ సినిమా.. తక్కువ సమయంలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది.
మహారాజా మూవీ రిలీజై సుమారు నెల అవుతోంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు మహారాజా ఓటీటీ రిలీజ్ డేట్‌పై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జులై 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో మహారాజా మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకుంది.
Also Read: iPhone 14 Price Drop: ‘మాన్‌సూన్ ఫెస్ట్ సేల్’.. రూ.38 వేలకే యాపిల్ ఐఫోన్ 14!
ఈ సినిమాలో మహారాజ అనే బార్బర్ పాత్రను విజయ్ సేతుపతి పోషించారు. మహారాజ సినిమాను ఆసక్తికర కథనంతో క్రైమ్ థ్రిల్లర్‌గా దర్శకుడు తెరకెక్కించాడు. ఇందులో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించగా.. మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామ్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ చిత్రంకు అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించాడు.