Site icon NTV Telugu

Kushi: సామ్ కి ముందెనక చూడకుండా మనసిచ్చి బాధపడుతున్నావా రౌడీ?

Kushi

Kushi

రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత నటిస్తున్న ప్యూర్ లవ్ స్టోరీ సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ సౌత్ మొత్తం తిరుగుతూ ఖుషి సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ మూవీ నార్త్ ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సమంత మాత్రం తన పార్ట్ ప్రమోషన్స్ ని కంప్లీట్ చేసుకోని ట్రీట్మెంట్ కోసం న్యూయార్క్ వెళ్లిపోయింది. సాంగ్స్ చాలా ముందే రిలీజ్ చేసారు, ట్రైలర్ కూడా రిలీజ్ డేట్ దగ్గరలో వదలాల్సింది ముందే బయటకి వదిలారు. దీంతో జనరేట్ అయిన హైప్ మళ్లీ, ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయడంలో గ్యాప్ రావడంతో ఖుషి సినిమాపై హైప్ తగ్గుతుందని కొందరి అభిప్రాయం. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై ఖుషి ప్రమోషన్స్ లో మరింత జోష్ కనిపించాలని కొందరు కామెంట్స్ చేసారు.

ఈ మాటలు మేకర్స్ వరకూ వెళ్లాయో లేదో కానీ ఖుషి సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. ‘ఓసి పెళ్లామా’ అంటూ సాగనున్న 5వ పాటని మేకర్స్ ఆగస్టు 26న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసారు. ఈ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ ‘ఓసి పెళ్లామా’ సాంగ్ ప్రోమోని వదిలారు. పార్టీ సెటప్ లో విజయ్ దేవరకొండ “మొదటిసారి కాశ్మీర్ లో చూడగానే మానసిచ్చాను. నాన్న మాట వినకుండా కాపురం మొదలుపెట్టాను, స్ట్రగుల్ స్టార్ట్ అయ్యారో” అంటూ సాంగ్ ఎత్తుకున్నాడు. ఈ లిరిక్స్ వింటుంటే సమంత, దేవరకొండని ఎన్ని కష్టాలు పెడుతుందో అర్ధం చేసుకోవచ్చు. హేషం అబ్దుల్ చాలా మంచి ట్యూన్ ఇవ్వగా, శివ నిర్వాణ చాలా క్యాచీ లిరిక్స్ ని రాసాడు. వినగానే పడుకునేలా ఉన్న లిరిక్స్ ని రాహుల్ సిప్లిగంజ్ అంతే జోష్ లో పాడాడు. ప్రోమోతోనే అట్రాక్ట్ చేసిన ‘ఓసి పెళ్లామా’ ఫుల్ సాంగ్, ఇంకెంత వైరల్ అవుతుందో చూడాలి.

Exit mobile version