Site icon NTV Telugu

Dasara: ఓరివారీ… ఈ ప్రేమికుల రోజున ఎంజాయ్ చెద్దాం పద

Dasara

Dasara

“ప్రతి వ్యాలెంటైన్స్ డేకి ప్రేమని సెలబ్రేట్ చేసుకుంటాం, ఈసారి మాత్రం హార్ట్ బ్రేక్ ని సెలబ్రేట్ చేసుకుందాం” అని దసరా సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని అనౌన్స్ చేశాడు నాని. మార్చ్ 30న రిలీజ్ కానున్న ‘దసరా’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని వ్యాలెంటైన్స్ డే గిఫ్ట్ గా రిలీజ్ చెయ్యబోతున్నాం అని నాని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ప్రేమికుల రోజు గిఫ్ట్ గా సాంగ్ బయటకి వస్తుంది అంటే ఇదేదో నాని, కీర్తి సురేష్ మధ్య కంపోజ్ చేసిన లవ్ ట్రాక్ సాంగ్ అనుకునేరు, ఇది హార్ట్ బ్రేక్ సాంగ్ అంట. ఈ సాంగ్ ఏంటి? ఎలా ఉండబోతుంది? అనే డీటైల్స్ తెలియాలి అంటే ఫిబ్రవరి 13 వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే ఆ రోజు ఈ సాంగ్ రిలీజ్ కానుంది.

ఇంతకీ ఈ సాంగ్ పేరు ఏంటో చెప్పలేదు కదా, “ఓరివారీ”… అవును అదే దసరా సినిమాలోని సెకండ్ సాంగ్ టైటిల్. ఓరివారీ అనగానే మంచి జోష్ ఉండే సాంగ్ లా అనిపిస్తుంది మరి హేఅర్త్ బ్రేక్ ని ఎంజాయ్ చెయ్యడానికి నాని ఇచ్చే ఆ సాంగ్ ఏంటో చూడాలి. ఇప్పటికే దసరా సినిమా నుంచి ‘దోస్తాన్’ సాంగ్ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ అయ్యింది. కథకి, నేటివిటీకి స్టిక్ అయ్యి మేకర్స్  దసరా సినిమాలోని సాంగ్స్ కి ‘దోస్తాన్’, ‘ఓరివారీ’ లాంటి టైటిల్స్ పెడుతున్నట్లు ఉన్నారు. మరి మొదటి పాట ‘దోస్తాన్’ లాగే ఈ సెకండ్ సాంగ్ ‘ఓరివారీ’ కూడా ఇన్స్టాంట్ చార్ట్ బస్టర్ అవుతుందేమో చూడాలి. పైగా నాని సినిమాలో హార్ట్ బ్రేక్ సాంగ్స్ కూడా చాలా ఎంజాయ్ చేసేలా ఉంటాయి. నిన్ను కోరి సినిమాలో ‘ఉమా గాడి లైఫ్’ అనే సాంగ్ బ్రేక్ ఏంథమ్ గా మిగిలిపోయింది. ఇదే రేంజులో ‘ఓరివారీ’ సాంగ్ కూడా ఉంటే సౌండ్ బాక్సులు మొగిపోవడం గ్యారెంటీ.

 

Exit mobile version