Site icon NTV Telugu

Operation Valentine: ఇట్స్ అఫీషియల్: వాయిదా పడ్డ వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్.. రిలీజ్ అయ్యేది అప్పుడే!

Operationvalentine

Operationvalentine

Operation Valentine Postpones to March 1st: ఈ మధ్యనే వివాహం చేసుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు హిందీ భాషలలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సోలో రిలీజ్ డేట్ సర్దుబాట్లలో భాగంగా ఫిబ్రవరి 16వ తేదీన ఊరు పేరు భైరవకోన సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపద్యంలో ఫిలిం ఛాంబర్ సంప్రదింపులు జరిపిన క్రమంలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాని రెండు వారాలు వెనక్కి జరిపింది సినిమా యూనిట్. ఈ నేపథ్యంలో సినిమాని మార్చి 1వ తేదీన రిలీజ్ చేస్తున్నామని చెబుతూ అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించింది.

Solo Release Date: ‘ఈగల్’కి ఊరట.. పోటీ నుంచి తప్పుకున్న మరో సినిమా

శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది ఆయనకి దర్శకుడిగా మొదటి సినిమా. సోనీ పిక్చర్స్ తో పాటు సందీప్ ముద్ద, నందకుమార్ అబ్బినేని సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. వరుణ్ తేజ్ వాయుసేన అధికారిగా నటిస్తున్న ఈ సినిమాలో మానుషి చిల్లర్, నవదీప్, మహమ్మద్ మీరు సర్వర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఎంచుకున్న మార్చి 1వ తేదీన ఎలాంటి సినిమా ఇప్పటివరకు రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఒక రకంగా వరుణ్ తేజ్ కి కూడా ఇది సోలో రిలీజ్ గానే ఉంటుంది. అది కొంతవరకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి

Exit mobile version