NTV Telugu Site icon

Operation Raavan: పలాస హీరో ఆపరేషన్‌ రావణ్‌ వచ్చేది ఎప్పుడో తెలుసా..?

Opr

Opr

Operation Raavan Movie: పలాస 1978’ సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు యంగ్ యాక్టర్‌ రక్షిత్‌ అట్లూరి. కరుణకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమా తెరకెక్కించిన మేకర్స్‌ నుంచి మరో ప్రాజెక్ట్‌ వస్తోంది. సాయి మోహన్‌ ఉబ్బన దర్శకత్వంలో సుధాస్ మీడియా బ్యానర్ మీద ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న చిత్రం “ఆపరేషన్ రావణ్”. హై ఆక్టేన్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రక్షిత్ సరసన మలయాళ భామ సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించారు.

Also Read:Ninnu Vadalanu: నిన్ను వదలను అంటున్న రష్యా భామ

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే మూవీ కూడా భారత దేశం అంతా గర్వించే దగ్గ సినిమా అవుతుంది. ఏదో డైరెక్షన్ అంటే డైరెక్షన్ చేశారు అని కాకుండా.. అన్ని విషయాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకుని చేశారు. అందరికంటే ముందే ఉదయమే సెట్స్‌లో ఉండేవారు. సినిమా చాలా బాగా వచ్చింది. మా ఈ కాన్ఫిడెంట్ కు కారణం అదే అని హీరో రక్షిత్ చెప్పుకొచ్చారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ‘సైకో స్టోరీ’ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 2న విడుదలకు సిద్ధం అయ్యింది.

Show comments