Site icon NTV Telugu

Adipurush: సరిగ్గా నెల రోజున తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటో చూస్తారు

Adipurush

Adipurush

సరిగ్గా నెల రోజుల తర్వాత ఇదే రోజున ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి ప్రభాస్ వస్తున్నాడు. ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ “సీతా రాముల” కథతో తెరకెక్కింది. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండగా, కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అత్యంత భారి బడ్జట్ తో రూపొందిన ఆదిపురుష్ మూవీ జనవరిలోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ టీజర్ రిలీజ్ సమయంలో విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో హ్యూజ్ నెగటివ్ కామెంట్స్ అండ్ ట్రోల్లింగ్ రావడంతో రిలీజ్ కి వాయిదా వేశారు. ఆదిపురుష్ సినిమాని జనవరి నుంచి జూన్ 16కి వాయిదా వేసిన ఓం రౌత్, గత కొన్ని నెలలుగా విజువల్ ఎఫెక్ట్స్ పై వర్క్ చేస్తూనే ఉన్నాడు. గ్రాఫిక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోని ఓం రౌత్ మార్పులు చేశాడు. ఈ కరెక్షన్స్ విషయంలో ఓం రౌత్ పెట్టిన ఎఫోర్ట్స్, ఈరోజు ఆదిపురుష్ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణం అయ్యాయి. ‘జై శ్రీరామ్’ సాంగ్ ఆదిపురుష్ ప్రమోషన్స్ కి మంచి కిక్ ఇచ్చింది.

ఒక్క పోస్టర్, ఒక్క సాంగ్ తో ఆదిపురుష్ సినిమాపై అంచనాలు పెంచాడు ఓం రౌత్. నెగటివ్ కామెంట్స్ నెమ్మదిగా పాజిటివ్ కామెంట్స్ గా మారడం మొదలయ్యాయి. ఇక ఎప్పుడైతే ఆదిపురుష్ ట్రైలర్ బయటకి వచ్చింది, అన్ని లెక్కలు తారుమారు అయ్యాయి. ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ రావడంతో ఆదిపురుష్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సూపర్బ్ బజ్ ని జనరేట్ చేసిన ట్రైలర్, ఆదిపురుష్ పై నార్త్ లో ఎంత హైప్ ఉందో అందరికీ అర్ధం అయ్యేలా చేసింది. లేటెస్ట్ గా ఆదిపురుష్ ట్రైలర్ లోని ఐకానిక్ షాట్ అయినా “రాముడు హనుమంతుడిపై నిలబడి బాణాలు వేసే” సీన్ ని పోస్టర్ గా రిలీజ్ చేశారు. ఆదిపురుష్ రిలీజ్ నెల రోజులు మాత్రమే ఉండడంతో ఈ పోస్టర్ ని మేకర్స్ బయటకి వదిలారు. ఇప్పుడున్న హైప్ కి కాస్త పాజిటివ్ టాక్ యాడ్ అయితే చాలు ప్రభాష్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని కుదిపేస్తాడు.

Exit mobile version