Onam Release : ఓనమ్ స్పెషల్.. ముగ్గురు మలయాళ బిగ్ స్టార్స్ మధ్య బిగ్ ఫైట్

Mollywood

Mollywood

మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది ఓనమ్ పండుగ సీజన్ అత్యంత కీలకం కానుంది. బాక్సాఫీస్ వద్ద ముగ్గురు స్టార్ హీరోల చిత్రాలు ఒకేసారి తలపడనుండటంతో కేరళతో పాటు సౌత్ ఇండియా అంతటా ఆసక్తి నెలకొంది. కామెడీ, యాక్షన్, ఎమోషన్ వంటి అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఈ సీజన్ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.

నివిన్ పౌలి : ‘ప్రేమలు’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు గిరీష్ ఏడీ, నివిన్ పాలీతో కలిసి బెత్లెహెమ్ కుటుంబ యూనిట్(Bethlehem Kudumba Unit) అనే కామెడీ ఎంటర్టైనర్‌ను రూపొందించారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఓనమ్ కానుకగా వస్తోంది.

దుల్కర్ సల్మాన్ : ‘RDX’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు నహాస్ హిదాయత్ ఈసారి దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో ‘ఐ యామ్ గేమ్అనే హై-వోల్టేజ్ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌ను ప్లాన్ చేశారు. ఆగస్టు 20న ఓనమ్ కానుకగా విడుదల కానున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో వస్తోంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ : మాస్ డైరెక్టర్ వైశాఖ్ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఖలీఫా ఓనమ్ బరిలో నిలిచిన మరో భారీ చిత్రం. ఇందులో మరో విశేషం ఏమిటంటే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో కనిపించబోతున్నారు.

ఆగస్టులో విడుదల కానున్న ఈ చిత్రాల మధ్య పోటీ రసవత్తరంగా ఉండనుంది. ఒకవైపు నివిన్ పాలీ కామెడీతో నవ్విస్తుంటే, మరోవైపు దుల్కర్ మరియు పృథ్వీరాజ్ తమ యాక్షన్ విన్యాసాలతో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. మోహన్ లాల్ క్యామియో అదనపు ఆకర్షణ కావడంతో ‘ఖలీఫా’కు ఉన్న హైప్ కూడా తక్కువేం లేదు. మొత్తానికి ఈ పండుగ సీజన్ మలయాళ సినిమా చరిత్రలో ఒక బిగ్ ఫైట్ గా మారబోతుంది. మరి ఓనమ్ కు ఆడియెన్స్ ఎవరికీ జై కొడతారో చూడాలి.