NTV Telugu Site icon

Dasara: లాస్ట్ పాట… లాస్ట్ ప్రమోషనల్ కంటెంట్… రిజల్ట్ ఏంటో?

Dasara

Dasara

దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా మార్కెట్ ని కొత్త డోర్స్ ఓపెన్ చేశాడు. అతను వేసిన దారిలోనే ప్రతి ఒక్కరూ నడుస్తూ ఉన్నారు. ఒక సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేస్తే, ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చెయ్యాలి అని ఇండియాలోని ప్రతి స్టేట్ కి వెళ్లి మరీ సినిమాని ప్రమోట్ చెయ్యడం రాజమౌళికి మాత్రమే చెల్లింది. కేవలం మీడియాకి ఇంటర్వ్యూస్ మాత్రమే కాకుండా ఫాన్ మీట్స్, పబ్లిక్ ఇంటరాక్షన్స్, ఈవెంట్స్ పెట్టి మారీ రాజమౌళి తన సినిమాలని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. తన హీరోలు ఎవరైనా సరే, ఎంత స్టార్స్ అయినా సరే ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. బాహుబలి సమయంలో ప్రభాస్, రానా… ఆర్ ఆర్ ఆర్ సమయంలో చరణ్-ఎన్టీఆర్ లు ఇండియా మొత్తం తిరిగిన వారే. ఇప్పుడు రాజమౌళి లేకుండానే, జక్కన్న సినిమా కాకుండా నాని పాన్ ఇండియా మొత్తం తన సినిమా ప్రమోషన్స్ కోసం తిరుగుతూ ఉన్నాడు.

రాజమౌళి హీరో కాకుండా మరొకరు ఈ మధ్య కాలంలో ఈ రేంజులో తన సినిమాని ప్రమోట్ చెయ్యడం ఇదే మొదటిసారి. ఒక కొత్త దర్శకుడిని, అతను చెప్పిన మాస్ కంటెంట్ ని నమ్మి దసరా సినిమాని పాన్ ఇండియా లెవల్లో ప్రమోట్ చేస్తున్న నాని… ఎట్టకేలకు ఫైనల్ లెగ్ ఆఫ్ ప్రమోషన్స్ కి చేరుకున్నాడు. మరో 24 గంటల్లో ఆడియన్స్ ముందుకి దసరా సినిమా ప్రీమియర్స్ రాబోతున్నాయి. దీంతో ప్రమోషన్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ నాని, దసరా సినిమా నుంచి లాస్ట్ సాంగ్ ని ఈరోజు రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. ‘ఓ అమ్మలాలో అమ్మలాలో’ అంటూ సాగే సాంగ్ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి రిలీజ్ చెయ్యనున్నారు. మరి ఈ సాంగ్ తో దసరా సినిమా ప్రీరిలీజ్ ప్రమోషన్స్ ని కంప్లీట్ చెయ్యబోయే నాని బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

Show comments