Site icon NTV Telugu

Om Raut : ఆదిపురుష్ ఫ్లాప్‌‌తో కాన్ఫిడెన్స్ కోల్పోయాను..

Om Routh

Om Routh

ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం విమర్శల గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ మేకర్స్‌కు భారీ నష్టాలను మిగిల్చింది. రామాయణాన్ని తెరపై చూపిన విధానం, అతి గ్రాఫికల్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అలాగే సినిమా స్క్రీన్‌ప్లేపై విమర్శలు వచ్చాయి. మొదటి రోజే పెద్ద ఓపెనింగ్ వచ్చినా, తర్వాత బాక్సాఫీస్‌లో కుదించకపోవడం, ప్రేక్షకులను ఆకర్షించలేకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో దర్శకుడు ఓం రౌత్ పై వచ్చిన విమర్శలు అంత ఇంత కాదు.. దీనిపై తాజాగా తన భావాలను షేర్ చేసుకున్నారు. సినిమా ఫెయిల్యూర్ తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందులు, ట్రోలింగ్ వల్ల కలిగిన మానసిక ప్రభావాన్ని ఆయన వివరించారు. ఓం రౌత్ మాట్లాడుతూ..

Also Read : Dhanush : సెన్సార్ క్లియర్ చేసుకున్న ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’

“తప్పులు జరగడం సహజం. విజయం మనకు ఎక్కువ నేర్పిస్తుందనిపిస్తుంది, కానీ వైఫల్యం మరింత బోధన ఇస్తుంది. తప్పుల నుంచి నేర్చుకుని, వాటిని మళ్లీ జరగకుండా చూడటం ద్వారా ముందుకు సాగవచ్చో. అదే మిగిలిన ఆశ. కానీ ఆదిపురుష్‌పై వచ్చిన విపరీతమైన ట్రోలింగ్, విమర్శలు నాకు ఎంతో మానసిక ఒత్తిడికి గురి చేసింది. ఇది మనల్ని మాత్రమే కాకుండా, మన కుటుంబాన్ని, టీమ్ సభ్యులను కూడా బ్రేక్ చేస్తుంది. నేను మొత్తం కాన్ఫిడెన్స్ కోల్పోయాను. నా కుటుంబం, స్నేహితులు, సన్నిహిత టీమ్ సభ్యుల సపోర్ట్ వల్లనే ఈ కష్టాలను అధిగమించగలిగాను. తిరిగి ప్రేక్షకుల నమ్మకాని పొందడానికి నేను చాలా కష్టపడాలి’ అని ఓం రౌత్ పేర్కొన్నారు. ప్రజంట్ ఓం రౌత్ నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇన్‌స్పెక్టర్ జెండె’ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ పొందుతోంది.

Exit mobile version