Site icon NTV Telugu

Om Raut : ఆదిపురుష్ పై ’ఓం రౌత్’ వింత కామెంట్స్..

Aadipurush

Aadipurush

Om Raut : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ప్లాప్ అవడమే కాదు.. ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. భారీ అంచనాలతో వచ్చి బొక్కబోర్లా పడింది. ఓం రౌత్ ను ఏ స్థాయిలో ట్రోల్స్ చేశారో మనకు తెలిసిందే. ప్రభాస్ లుక్స్ మీద పెద్ద చర్చ జరిగింది. అలాంటి సినిమాను ఇంకా ప్లాప్ అని ఒప్పుకోవడానికి డైరెక్టర్ ఓం రౌత్ కు మనసు రావట్లేదు కాబోలు. ఎంతైనా ఆయన తీసిన సినిమా కదా. అందుకే ఎవరు ఎంత చెబుతున్నా సరే దాన్ని ప్లాప్ అని చెప్పడానికి మనసు రాక.. రకరకాల కవరింగ్ లు ఇస్తూనే ఉన్నాడు. తాజాగా వేవ్ సమ్మిట్ లో పాల్గొన్న ఈయన ఆదిపురుష్ మీద స్పందించాడు.
Read Also : Samantha : సమంత ‘శుభం’ మూవీ నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజ్..

తెలుగులో రూ.120 కోట్లకు ఆదిపురుష్ ను కొన్నారు. అంటే ఎక్కువ మంది ప్రేక్షకులు చూసినట్లే కదా అని చెప్పుకొచ్చాడు. ఇది విన్న డార్లింగ్ ఫ్యాన్స్ కు నోట మాట రావట్లేదు. ఎక్కువకు కొంటే ఎక్కువ మంది చూసినట్టు కాదు. అంతకు మించి వసూళ్లు వస్తే ఎక్కువ మంది చూసినట్టు అనే చిన్న లాజిక్ కూడా ఓం రౌత్ కు తెలియదా అంటూ ఏకి పారేస్తున్నారు. ఇంకా ఆ మూవీ గురించి మాట్లాడి ఎందుకు తిట్టించుకుంటావ్ అంటూ ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. మొత్తానికి ఓం రౌత్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేశాడు.
Read Also : Dilraju : శ్రీవారి పేరుతో ఏఐ స్టూడియో లాంచ్ చేసిన దిల్ రాజు..

Exit mobile version