Site icon NTV Telugu

Om Bheem Bush: ఏం ప్రమోషన్స్ రా ఇవి.. అనంత్ అంబానీ పెళ్లిలో స్పీచ్ ఏంటి మావా..

Om

Om

Om Bheem Bush: సినిమా హిట్ అవ్వాలంటే ప్రమోషన్స్ ముఖ్యం బిగిల్.. ఇదే ప్రస్తుతం ఇండస్ట్రీ నమ్ముతుంది. నమ్మడం కాదు నిజం కూడా అదే. సినిమా ఎలా ఉన్నా.. ప్రమోషన్స్ తో థియేటర్ వరకు ప్రేక్షకులను రప్పించేలా చేయాలి. అదే పెద్ద టాస్క్. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నాం.. పెద్ద స్టార్స్ ఉన్నారు అంటే కుదరదు.. ప్రమోషన్స్ కు పెద్ద, చిన్న తేడా లేదు. ఎవరు ఎక్కువ ప్రమోషన్స్ చేస్తే.. ప్రేక్షకులు అంత ఎక్కువ థియేటర్స్ కు క్యూ కడతారు. ఈ మధ్యకాలంలో వెరైటీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఎలారా ఇలాంటి ప్రమోషన్స్ ఐడియాలు వస్తాయి అనేంతలా మేకర్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఈ ప్రమోషన్స్ గోల ఏంటి.. ? ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు..? అనేగా డౌట్. బ్రోచేవారెవరురా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన ముగ్గురు హీరోలు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. మరోసారి ఓం భీమ్ బుష్ అంటూ వచ్చేస్తున్నారు. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేశారు ఈ హీరోలు. అందరిలా అయితే మా ప్రమోషన్స్ ఎవరు చూస్తారు అనుకున్నారేమో.. కాస్త డిఫరెంట్ గా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఒక రూమ్ చూపించి.. కొద్దిసేపటి తరువాత ఈ ముగ్గురు వచ్చి.. ఏంటి చూస్తున్నారు. చదువుకోండి ఫస్ట్.. లవ్ సంగతి పేరెంట్స్ చూసుకుంటారు అంటూ కామెడీ చేయడం మొదలుపెట్తారు. ఇక్కడే కాదు.. లవర్స్ దొరికే ప్రతి ప్లేస్ లో ఇదే డైలాగ్ చెప్పుకొచ్చారు. మెట్రో స్టేషన్, పార్క్ ఇలా.. ఎడిట్ చేసిన వీడియో నిన్న రిలీజ్ చేశారు. ఇక ఈరోజు ఏకంగా అనంత్ అంబానీ పెళ్లిలో ఈ కుర్ర హీరోలు సందడి చేశారు. ఈ పెళ్ళికి పిలిచినందుకు ముకేష్ అంబానీకి థాంక్స్ కూడా చెప్పగా.. ఆయన వీరి మాటలకు ఎమోషనల్ అయ్యారు. అంటే అలా ఎడిట్ చేశారు అన్నమాట. ఈ ప్రమోషన్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఏం ప్రమోషన్స్ రా ఇవి.. అనంత్ అంబానీ పెళ్లిలో స్పీచ్ ఏంటి మావా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version