NTV Telugu Site icon

Ollulleru: 100 మిలియన్ల వ్యూస్ సాధించిన మళయాల సాంగ్.. వింటే మళ్ళీ మళ్ళీ వినాల్సిందే!

Ollulleru Song

Ollulleru Song

Ollulleru song crosses 100 million views: ‘అజగజంతారామ్’ చిత్రంలోని ‘ఒల్లులేరు’ పాట పది కోట్ల 100 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఈ క్రమంలో యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 100 మిలియన్ వ్యూస్‌ను దాటిన మొట్టమొదటి మలయాళ పాటగా ఈ పాట నిలిచింది. జానపద గేయ కళాకారిణి ప్రసీద చాలకుడి పాడిన ‘ఒల్లులేరు’ పాట ఆకట్టుకునే ట్యూన్తో, చాలా నేచురల్ డ్యాన్స్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. పాట విడుదలై దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ‘ఒల్లులేరు’కు అభిమానులు ఎందరో ఉన్నారని అంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఈ ‘ఒల్లులేరు’ అనేది మావిలన్ తెగ సంప్రదాయ పాట. ఒక్కసారి వింటే హృదయాలను హత్తుకునే పల్లెటూరి పాట. ‘ఒల్లులేరు’ కేరళలోని ఉత్తర జిల్లాలలో, ముఖ్యంగా కాసర్‌గోడ్ ప్రాంతాలలో మూలాలను కలిగి ఉంది.

Telugu Movies this week: ఈ వారం సినీ లవర్స్‌కి పండగే ఏకంగా 34 రిలీజులు

‘అజగజంతారా’ సినిమా కోసం జస్టిన్ వర్గీస్ ఈ పాటను కొత్త తరహాలో చేసి రిలీజ్ చేశారు. తిను పప్పచ్చన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అజగజంతారం’. ఓ ఏనుగు, పాపాన్‌తో పాటు యువకుల బృందం ఉత్సవ ప్రాంగణానికి రావడం, ఆ తర్వాత అక్కడ జరిగే సంఘటనలే ఈ సినిమా గాథ. పెళ్లి ఇంట వేడుకలో భాగంగా ‘ఒల్లులేరు’తో సినిమాలో పాత్రల పరిచయం అవుతాయి. సినిమాలోని హీరో పెపే (ఆంథోనీ వర్గీస్), అతని స్నేహితులు డ్యాన్స్ ఇరగదీస్తారు. చెంబన్ వినోద్, అర్జున్ అశోక్, జాఫర్ ఇడుక్కి, రాజేష్ శర్మ, సుధీ కొప్పా, వినీత్ విశ్వం, లుక్మాన్, శ్రీరంజిని ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. మరియు ఇతరులు అజగజంటర్‌లో ఇతర నటీనటులు. ‘ఒల్లుల్లేరు ఒళ్లుల్లేరు మణినంకరే…బీరాజ్‌పేట దొందుగేయే మణినంకరే…’ అనే మలయాళీలకు బాగా తెలిసిన పదాలు వీటిని ఒకపాటగా చేర్చి సూపర్ హిట్ కొట్టారు.