Ollulleru: 100 మిలియన్ల వ్యూస్ సాధించిన మళయాల సాంగ్.. వింటే మళ్ళీ మళ్ళీ వినాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ollulleru song crosses 100 million views: ‘అజగజంతారామ్’ చిత్రంలోని ‘ఒల్లులేరు’ పాట పది కోట్ల 100 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఈ క్రమంలో యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 100 మిలియన్ వ్యూస్‌ను దాటిన మొట్టమొదటి మలయాళ పాటగా ఈ పాట నిలిచింది. జానపద గేయ కళాకారిణి ప్రసీద చాలకుడి పాడిన ‘ఒల్లులేరు’ పాట ఆకట్టుకునే ట్యూన్తో, చాలా నేచురల్ డ్యాన్స్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. పాట విడుదలై దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ‘ఒల్లులేరు’కు అభిమానులు ఎందరో ఉన్నారని అంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఈ ‘ఒల్లులేరు’ అనేది మావిలన్ తెగ సంప్రదాయ పాట. ఒక్కసారి వింటే హృదయాలను హత్తుకునే పల్లెటూరి పాట. ‘ఒల్లులేరు’ కేరళలోని ఉత్తర జిల్లాలలో, ముఖ్యంగా కాసర్‌గోడ్ ప్రాంతాలలో మూలాలను కలిగి ఉంది.
Telugu Movies this week: ఈ వారం సినీ లవర్స్‌కి పండగే ఏకంగా 34 రిలీజులు
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
‘అజగజంతారా’ సినిమా కోసం జస్టిన్ వర్గీస్ ఈ పాటను కొత్త తరహాలో చేసి రిలీజ్ చేశారు. తిను పప్పచ్చన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అజగజంతారం’. ఓ ఏనుగు, పాపాన్‌తో పాటు యువకుల బృందం ఉత్సవ ప్రాంగణానికి రావడం, ఆ తర్వాత అక్కడ జరిగే సంఘటనలే ఈ సినిమా గాథ. పెళ్లి ఇంట వేడుకలో భాగంగా ‘ఒల్లులేరు’తో సినిమాలో పాత్రల పరిచయం అవుతాయి. సినిమాలోని హీరో పెపే (ఆంథోనీ వర్గీస్), అతని స్నేహితులు డ్యాన్స్ ఇరగదీస్తారు. చెంబన్ వినోద్, అర్జున్ అశోక్, జాఫర్ ఇడుక్కి, రాజేష్ శర్మ, సుధీ కొప్పా, వినీత్ విశ్వం, లుక్మాన్, శ్రీరంజిని ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. మరియు ఇతరులు అజగజంటర్‌లో ఇతర నటీనటులు. ‘ఒల్లుల్లేరు ఒళ్లుల్లేరు మణినంకరే…బీరాజ్‌పేట దొందుగేయే మణినంకరే…’ అనే మలయాళీలకు బాగా తెలిసిన పదాలు వీటిని ఒకపాటగా చేర్చి సూపర్ హిట్ కొట్టారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!