మొన్న ఎన్టీఆర్… నేడు ఒలివియా మోరిస్! ఉక్రెయిన్ లోని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచీ ఫ్యాన్స్ కు అందుతోన్న అప్ డేట్స్ తెగ ఎగ్జైట్మెంట్ కలిగిస్తున్నాయి! రాజమౌళి మాస్టర్ పీస్ లో నటిస్తోన్న లండన్ యాక్ట్రస్ ఒలివియా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. ‘ఓహ్! ఇట్స్ గుడ్ టు బి బ్యాక్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజంగానే ఆమె ‘ఆర్ఆర్ఆర్’ బిహైండ్ ద సీన్స్ లెటెస్ట్ పిక్ లో వెనక్కి తిరిగి ఉంది. బ్యాక్ చూపిస్తూ… గుడ్ టు బి బ్యాక్ అంటోంది. అయితే, ఇందులో అసలు విషయం ఏంటంటే… ఒలివియా మోరిస్ లండన్ నుంచీ వెళ్లి ఉక్రెయిన్ లో ‘ఆర్ఆర్ఆర్’ షూట్ లో పాల్గొనటం.
Read Also : పెళ్ళి ప్లాన్స్ చెప్పేసిన కియారా !
ప్రస్తుతం జక్కన్న ఓ పాట చిత్రీకరిస్తున్నాడు విదేశీ లోకేషన్ లో. అక్కడే ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. తాజా ఫోటోతో ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తోన్న ఒలివియా కూడా తిరిగి సెట్స్ మీద కాలుమోపిందనేది స్పష్టమవుతోంది… కరోనా కారణంగా బాగా ఆలస్యమైన ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13న వస్తుందంటున్నారు. ఏ అవాంతరమూ రావద్దని చరణ్, తారక్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. చూడాలి మరి, చివరి దశ షూటింగ్ కు చేరుకున్న ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13న విడుదలై… ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో!
