Site icon NTV Telugu

‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై తారక్ ప్రేయసి ఏమందంటే..?

సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా “ఆర్ ఆర్ ఆర్”.. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఫైనల్ షెడ్యూల్‌ కోసం చిత్ర బృందం ఇటీవల ఉక్రెయిన్‌ వెళ్ళింది. ఓ పాటతో పాటుగా కొన్ని కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. కాగా, తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లోకి హాలీవుడ్‌ బ్యూటీ ఒలీవియా మోరీస్‌ తిరిగి జాయిన్ అయింది. చాలారోజుల తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మొత్తాన్ని కలవడం తనకెంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. ఈ సినిమాలో ఆమె తారక్‌ ప్రేయసి పాత్రలో కనిపించనుండగా, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, చరణ్ సరసన నటించనుంది. అక్టోబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version