Site icon NTV Telugu

Extra Ordinary Man: శ్రీలీల డాన్స్ తో సెగలు పుట్టించింది… ప్రోమో అదిరిపోయింది

Extra Ordinary Man

Extra Ordinary Man

యంగ్ హీరో నితిన్… శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్. వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ డిసెంబర్ 8న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ప్రమోషన్స్ ని స్పీడప్ చేసారు. ఇటీవలే రిలీజైన ట్రైలర్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాకి మరింత బజ్ జనరేట్ చేసింది. నితిన్ చాలా రోజుల తర్వాత ఫన్ ట్రాక్ ఎక్కి చేస్తున్న ఈ సినిమా నుంచి డిసెంబర్ 8న ‘ఓలే ఓలే పాపాయి’ సాంగ్ బయటకి రానుంది. జానీ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని హరీష్ జైరాజ్ మంచి జోష్ ఫుల్ గా కంపోజ్ చేసాడు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా రామ్ మిర్యాల, ప్రియా కలిసి ఓలే ఓలే పాపాయి సాంగ్ ని పాడారు.

Read Also: Radhika Apte : అతడి కోసమే ఆ సీన్ లో నటించాల్సి వచ్చింది..

ఈ సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేసారు. హై పిచ్ ఎనర్జీ, జానీ మాస్టర్ తాలూకు డాన్స్ ప్రోమో సాంగ్ ని పూనకాలు తెప్పించేలా చేసింది. నితిన్ డాన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక నితిన్ కి శ్రీలీల కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎంత ఊహించిన అంతకు మించి అనేలా ఉంది ఓలే ఓలే పాపాయి ప్రోమో సాంగ్. ముఖ్యంగా శ్రీలీల వేసిన ఫ్లోర్ స్టెప్స్ అండ్ ఫాస్ట్ డాన్స్ మూమెంట్స్ అయితే సాంగ్ కే హైలైట్ గా మార్చాయి. ప్రోమో సాంగ్ కే ఇలా ఉంటే ఫుల్ సాంగ్ బయటకి వస్తే ఇంకెలా ఉంటుంది, ఇదే సాంగ్ ని థియేటర్స్ లో చూస్తే ఆడియన్స్ ఏ రేంజులో ఎంజాయ్ చేస్తారు అనేది చూడాలి.

Exit mobile version