Site icon NTV Telugu

Sharwanand: నాగార్జునతో అమల ఢీ!

Brahmastra

Brahmastra

ఇది చిత్ర విచిత్ర చిత్రసీమ! ఇక్కడ ఎన్నో వింతలు విశేషాలు జరుగుతుంటాయి. అలాంటిదే రాబోయే సెప్టెంబర్ 9న జరుగబోతోంది. విషయం ఏమిటంటే… ఆ రోజు ఇటు నాగార్జున నటించిన సినిమా ఒకటి, అటు ఆయన భార్య అమల నటించిన మూవీతో పోటీ పడబోతోంది. గతంలో బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించిన నాగార్జున ఈ మధ్య హిందీ సినిమాలు తగ్గించారు. అయితే కరణ్ జోహార్ మాట కాదనలేక, ‘బ్రహ్మాస్త్రం’ కథాంశం నచ్చి, ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో నాగార్జున ‘అనిష్’ అనే పాత్రను పోషించారు. ఆ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది.

ఇదిలా ఉంటే… ఇప్పుడు తాజాగా శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ మూవీ రిలీజ్ డేట్ ను నిర్మాతలు అనౌన్స్ చేశారు. అయితే ఏంటటా… అని అనుకోవచ్చు. అక్కడే ఓ చిన్న మెలిక ఉంది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న ‘ఒకే ఒక జీవితం’ మూవీలో అమల అక్కినేని ఓ కీలక పాత్ర పోషించింది. శర్వానంద్ సరసన రీతువర్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని కూడా సెప్టెంబర్ 9వ తేదీనే విడుదల రిలీజ్ చేయబోతున్నారు. సో… బాక్సాఫీస్ బరిలో ఒకే రోజున ఇటు నాగార్జున, అటు అమల నటించిన రెండు సినిమాలు ఒకదానితో ఒకటి రెండు భాషల్లో పోటీ పడబోతున్నాయి. ఇప్పటికే అమలపై చిత్రీకరించిన అమ్మ పాట సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందింది. జేక్స్ బిజోయ్ సంగీత దర్శకత్వం వహించిన ఈ మూవీ ద్వారా శ్రీకార్తిక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. తమిళంలో ‘కణం’ పేరుతో దీన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సంస్థకు ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. మరి నాగ్ – అమల చిత్రాలలో దేని వైపు అక్కినేని అభిమానులు మొగ్గుచూపుతారో చూడాలి. అలానే ఇప్పటికే సెప్టెంబర్ 9న కోడి రామకృష్ణ కుమార్తె దీప్తి… కిరణ్ అబ్బవరం హీరోగా నిర్మించిన ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

Exit mobile version