Oka Parvathi Iddaru Devadasulu : ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు మూవీ నిర్మాతలు కే.మురళి (షరత్ వర్మ), బి.ఆనంద్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. మేం ఈ సినిమా కోసం రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టాం. అన్ని ఖర్చులు మేం భరిస్తున్నాం. కాకపోతే ఈ మూవీకి సంబంధించిన రీ పేమెంట్స్ సాధ్యం కాలేదు. సెప్టెంబర్ 12, 2024న తోట రామకృష్ణ మూవీ రైట్స్ ను తనవిగా ప్రకటించేసుకున్నాడు. కనీసం మా పర్మిషన్ కూడా తీసుకోలేదు. ఈ సినిమా అతనిదే అని చెప్పుకుంటున్నాడు. మూవీ హక్కులను మా పేర్ల నుంచి అక్రమంగా బదిలీ చేసుకున్నాడు. ఇది మాకు అన్యాయమే అంటూ వాపోయారు.
Read Also : Tollywood : చర్చలు సఫలం.. రేపటి నుంచి షూటింగులు ప్రారంభం
రామకృష్ణ తోట మాకు ద్రోహం చేశాడు. మా అనుమతి లేకుండానే వార్తాపత్రికలలో టైటిల్, పోస్టర్లను పబ్లిష్ చేశాడు. దీని వల్ల మా ఆర్థిక నష్టానికి తోడు, మా ప్రతిష్ఠ కూడా నాశనం అయింది. రామకృష్ణ తోటపై IPC సెక్షన్లు 406 మరియు 420 కింద కేసులు నమోదు చేయడానికి మేం సిద్ధం అవుతున్నాం. ఈ విషయంలో న్యాయం జరిగే దాకా మేం వెనక్కి రాము. ఈ విషయంలో టాలీవుడ్ పెద్దలు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం, పోలీసులు చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలి అంటూ వేడుకున్నారు.
