Site icon NTV Telugu

Oh My Baby: గుంటూరు కారం ‘ఓమై బేబీ’ వచ్చేసింది

Oh My Baby Lyrical Song

Oh My Baby Lyrical Song

Oh My Baby Song Released from Guntur Kaaram Movie: మహేష్ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “గుంటూరు కారం” సినిమా నుంచి రెండో సింగిల్ విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన “ఓ మై బేబీ” అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట వింటుంటే హీరో దృష్టిలో పడి ఆయన ప్రేమ దక్కించుకునేందుకు హీరోయిన్ పాడుకుంటున్న పాటలా అనిపినింది. థమన్ స్వరపరచగా శిల్పా రావు పాడిన ఈ పాట ప్రోమో రిలీజ్ అయినప్పుడు బుట్టబొమ్మ ట్యూన్ కి కాపీలా ఉందని అనుకున్నారు, కానీ పాట మొత్తం విన్న తరువాత అదేమీ లేదనిపించింది. సినిమాలో మహేష్ బాబు పాత్ర పట్ల శ్రీలీల పాత్రకు గల ప్రేమానురాగాలను తెలియజేసేలా ఈ పాట ఉంది.

Hyderabad CP: టాలీవుడ్ పై సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రామజోగయ్య శాస్త్రి పాటల్లో “నీ కోసం ఆరాటం నా పిల్లో పక్కానా నవల నువ్వు,” “ట్రిప్పింగ్ ట్రిప్పింగ్ ఆన్ యు నా ప్లేలిస్ట్ అయిపోయావు నువ్వు,”, ఇతరత్రా ట్రెండీ ఎక్స్‌ప్రెషన్స్ అయితే హైలైట్ ఉన్నాయి. మొదటి పాట “దమ్ మసాలా” లాగా ఇది వెంటనే ఎక్కదు కానీ నెమ్మదిగా అలవాటయ్యేలా ఉంది. ఇక ఈ పాటను మహేష్ బాబు మరియు శ్రీలీలపై చిత్రీకరించారు. ఇక గుంటూరు కారం మూవీలో మహేష్‌బాబుకు జంటగా శ్రీలీల నటించగా మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, రమ్య కృష్ణ, జయరాం, ప్రకాశ్‌రాజ్‌, సునీల్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్న ఈ గుంటూరు కారంకు సంక్రాంతి బరిలో మాత్రం పోటీ గట్టిగా ఉంది. నాగార్జున ‘నా సామిరంగ’, వెంకటేష్‌ ‘ సైంధవ్‌, ప్యాన్‌ ఇండియా మూవీ ‘హానుమాన్‌’లు కూడా సంక్రాంతి సందర్భంగానే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Exit mobile version