ఓజీ ట్రైలర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు అభిమానులు. కానీ మేకర్స్ మాత్రం డిసప్పాయింట్ చేశారు. అయితే, ఓజీ కాన్సర్ట్‌లో పవన్ పట్టుబట్టడంతో ట్రైలర్ ప్లే చేశారు. ఇంకేముంది.. వెంటనే ఆ ట్రైలర్‌ను సోషల్ మీడియాలో పెట్టేశారు కొందరు. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత.. ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయేలా ఉంది. అభిమానులకు మాత్రమే కాదు.. ప్రేక్షకులు అందరికీ పూనకాలు తెప్పించేలా ఉంది ‘ఓజీ’ ట్రైలర్. రెండున్నర నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్.. పవర్ ప్యాక్డ్‌గా ఉంది. ఓమి, ఓజీ మధ్య జరిగిన ఊచకోతకు థియేటర్లన్నీ బ్లడ్ బాత్ కాబోతున్నట్టుగా ఉంది. ముంబైలో ఓమి అరచాకాలు పెరిగిన తర్వాత.. అతన్ని అడ్డుకోవడం ఒక్క ఓజీ వల్లే అవుతుందని.. పవన్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు.
Also Read :They Call Him OG Trailer : ఓజీ ట్రైలర్ అదిరింది.. చూశారా?
ముంబై వస్తున్న.. తలలు జాగ్రత్త అని పవన చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్‌కు మెంటెలెక్కిచడం గ్యారెంటీ. ఇక ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే.. చివరలో వచ్చే షాట్ మాత్రం మరొ ఎత్తు అనే చెప్పాలి. ‘ఓజాస్ గంభీర..’ అంటూ పవన్ చేసే పూనకాలకు థియేటర్లు తగలబడిపోవడం గ్యారెంటీ. ఫ్యాన్స్‌కు ఏదైతే కావాలో.. అంతకుమించి అనేలా హై ఓల్టేజ్ ట్రైలర్ కట్ చేశాడు దర్శకుడు సుజీత్. ఒకప్పటి గ్యాంగ్‌స్టర్ కొన్నాళ్లు అన్ని వదిలేసి దూరంగా వెళ్లిపోవడం.. మళ్లీ కొన్ని కారణాల వల్ల తిరిగి రావడం.. అప్పుడు జరిగే ఓజీ వర్సెస్ ఓమి వార్.. ఇలా ఫ్యాన్స్‌కు ఇచ్చే హై మామూలుగా లేదన్నట్టుగా ట్రైలర్ ఉంది. ఇక ముందు నుంచి తమన్ ఇస్తున్న ఎలివేషన్ ఎలా ఉందో.. ట్రైలర్‌లో అంతకుమించి అనేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంది. మొత్తంగా ఓజీ ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. అఫీషియల్‌గా ఈ ట్రైలర్ బయటికొచ్చిన తర్వాత.. సెప్టెంబర్ 25న థియేటర్లన్నీ మెంటల్ మాస్‌గా మారిపోవడం పక్కా. అసలు ట్రైలర్ రిలీజ్ చేసిన చేయకపోయినా.. ఓజీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం గ్యారెంటీ
