NTV Telugu Site icon

OG: వచ్చాడయ్యా.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ను ఢీకొట్టే మొనగాడు

Og

Og

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం OG. dvv ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. విలన్ గా బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఇక వీరే కాకుండా అర్జున్ దాస్, శ్రియా రెడ్డి లాంటి నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ ఏడాది మొదట్లో మొదలుపెట్టిన ఈ సినిమా షూటింగ్ అప్పుడే సగానికి పైగా పూర్తిఅయ్యినట్లు మేకర్స్ చెప్పుకొస్తున్నారు. అంత త్వరగా షూటింగ్ ను ఎలా పూర్తిచేస్తున్నారో అది మేకర్స్ కే తెలియాలి. ఇక ఏ బ్యానర్ చేయని పని dvv ఎంటర్ టైన్మెంట్స్ చేస్తోంది. ఒకప్పుడు అప్డేట్స్ ఇవ్వండి మహా ప్రభో అని అడుక్కునే ఫ్యాన్స్ కు పండగకో.. పబ్బానికో ఒక అప్డేట్ ఇచ్చేవారు. ముఖ్యంగా హీరోల ఫోటోలు.. షూటింగ్ అప్డేట్స్ ను అస్సలు బయటికి పొక్కనిచ్చేవారు కాదు. కానీ, dvv ఎంటర్ టైన్మెంట్స్ మాత్రం తమ అప్డేట్స్ తోనే సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.

Karthika Deepam: ‘కార్తీక దీపం’ సీజన్ 2.. వంటలక్క ఫ్యాన్స్ రెడీనా.. ?

పవన్ సెట్ లో నిలబడినా పోస్టర్ .. కూర్చున్నా పోస్టర్.. ఒక నటుడు సెట్ లో అడుగుపెడితే అప్డేట్.. షూటింగ్ ఎండ్ చేస్తే అప్డేట్ ఇస్తూ.. సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. ఇక తాజాగా .. OG సెట్ లోకి బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ అడుగుపెట్టాడు. ఇప్పటివరకు ఇమ్రాన్.. తెలుగులో నటించింది లేదు. మొట్ట మొదటిసారి.. అది కూడా విలన్ గా ఈ రొమాంటిక్ హీరో కనిపించబోతున్నాడు. తాజాగా సెట్ లో సుజీత్ తో పాటు ఇమ్రాన్ హష్మీ మాట్లాడుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. ” ఇది ఎంతో అద్భుతమైన షెడ్యూల్.. OG సెట్ లో ఇమ్రాన్ హష్మీ మంచి సమయాన్ని గడిపారు అని అనుకుంటున్నాం. రాబోయే షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో ఫేస్ టూ ఫేస్ ఉండబోయే షెడ్యూల్ కోసం వేచి ఉండలేకపోతున్నాం” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. నిజం చెప్పాలంటే.. ఈ ఫోటోలో ఇమ్రాన్ నార్మల్ గానే ఉన్నాడు. ఇతనిలో పవన్ ను ఢీకొట్టే విలనిజాన్ని సుజీత్ చూపించగలడా..? అనేది తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.