OG : ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. ‘రన్ రాజా రన్’, ‘సాహో’ సినిమాలతో ప్రత్యేకమైన స్టైల్ చూపించిన దర్శకుడు సుజీత్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. పవన్ ఇందులో ఓజాస్ అనే పవర్‌ఫుల్ రోల్‌లో అలరించనుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిర్మాత డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read : Urmila : 30 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘రంగీలా’.. ఊర్మిళ ఎమోషనల్ పోస్ట్
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ఇటీవల పవన్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఓజీ గ్లింప్స్ సోషల్ మీడియాలో సునామీ సృష్టించింది. చిన్న సినిమాలు సంచలనాలు క్రియేట్ చేస్తుంటే, పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద కష్టాల్లో ఉన్న ఈ సమయంలో, ఓజీ మాత్రం ఆ ధోరణిని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నారు. ఇప్పటికే నార్త్ అమెరికాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రిలీజ్‌కు 18 రోజుల ముందే 50 వేలకు పైగా టికెట్లు సేల్ అవ్వడం, కేవలం నార్త్ అమెరికా నుంచే 12 లక్షల డాలర్ల గ్రాస్ రావడం ఈ క్రేజ్‌కు నిదర్శనం.
ఇకపోతే, ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో ఓ భారీ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు మేకర్స్. ఈ నెల 19న విజయవాడలో, 21న హైదరాబాద్‌లో ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే హైదరాబాద్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇది నిజమైతే మెగా ఫ్యాన్స్‌కి పండగే కాకుండా, పవన్-చిరంజీవి ఒకే వేదికపై కనిపించడం అభిమానులకు లైఫ్ టైమ్ సెలబ్రేషన్ అవుతుంది. మొత్తానికి ఓజీ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టిస్తుందా? అనే ప్రశ్నకు జవాబు సెప్టెంబర్ 25న రానుంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!