Offices In few areas Declare Holiday On Release Of Rajinikanth Jailer: ఆగస్టు 10న విడుదల కానున్న రజినీకాంత్ చిత్రం ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను కైవసం చేసుకుంటోంది. దాదాపు రెండేళ్ల తర్వాత రజనీకాంత్ మళ్లీ తెరపైకి వస్తున్నారు. దీంతో ఆయన అభిమానులకు శుభవార్తలు చెబుతున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ రోజు హాలిడే ప్రకటించేంత క్రేజ్ ఉన్న ఏకైక హీరో.. సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒక్కడేనని చెప్పవచ్చు. రజనీ కాంత్ సినిమా వస్తుందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా థియేటర్ల ముందు క్యూ కట్టేస్తారు. ఇప్పుడు జైలర్ విషయంలో అదే జరుగుతోంది. గత కొంత కాలంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సరైన హిట్ పడడం లేదు. అలా అని తలైవా క్రేజ్ తగ్గింది అనుకుంటే పొరబడినట్లే. రజనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి.. ఇది చిన్న ఉదాహరణగా చెప్పవచ్చు. నెల్సన్ కుమార్ దర్శకత్వంలో రజనీ కాంత్ నటించిన ‘జైలర్’ ఆగష్టు 10న థియేటర్లోకి రాబోతోంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన జైలర్ ట్రైలర్.. భాషా రేంజ్‌లో ఉండడంతో ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అందుకే జైలర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆయన ఫ్యాన్స్.
Vrushabha: మోహన్ లాల్, రోషన్ ‘వృషభ’కి హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
రిలీజ్ రోజు అన్ని పనులు పక్కకు పెట్టేసి పండగలా సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందుకోసం బడా బడా సంస్థలు తమ ఉద్యోగులకు ఏకంగా సెలవులు కూడా ప్రకటిస్తున్న దాఖలాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. జైలర్ రిలీజ్ సందర్భంగా యూనో ఆక్వా కేర్ అనే కంపెనీ తన ఎంప్లాయ్స్‌కు ఆగస్టు 10న సెలవు ప్రకటించింది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, చెంగల్‌పట్టు, మట్టుతావని, అరపాళ్యం, అలగప్పన్ నగర్ బ్రాంచ్‌లకు సెలవు ప్రకటించబోతున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికి ఫ్రీగా టిక్కెట్‌లు కూడా ఇవ్వనుంది. ఈ లెక్కన ఇప్పటికీ రజనీ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. జైలర్’ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన యాక్షన్ ప్యాక్డ్ సినిమా కాగా రజనీకాంత్ రిటైర్డ్ పోలీసు అధికారిగా కనిపిస్తారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, శివ రాజ్‌కుమార్, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, యోగి బాబు, వసంత్ రవి, వినాయకన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అతిధి పాత్రల కోసం మలయాళ నటుడు మోహన్‌లాల్, కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ లను కూడా మేకర్స్ రంగంలోకి దించారు.
