NTV Telugu Site icon

Producer Arrested: మహిళా జర్నలిస్టుతో అసభ్య ప్రవర్తన.. సినీ నిర్మాత అరెస్ట్

Sanjay Nayak Arrested

Sanjay Nayak Arrested

Odiya Producer Sanjay Nayak Arrested For Allegedly Assaulting Female Journalist: మహిళా జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో ఒడియా చిత్ర నిర్మాత సంజయ్ నాయక్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శుక్రవారం జరిగిన ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో టూటూ నాయక్‌గా పేరున్న చిత్రనిర్మాత తనను వెనుక భాగం మీద కొట్టి నవ్వుతూ అసభ్యంగా ప్రవర్తించాడు అని ఖారవేల నగర్ పోలీస్ స్టేషన్‌లో మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేసింది. నా చేతిలో నుండి నా మైక్, మొబైల్ ఫోన్ పడిపోయింది. నేను అవి తీసుకోవడానికి కిందకి వంగినప్పుడు ఆయన నా వీపుపై కొట్టాడు, అతను ఎందుకు అలా ప్రవర్తించాడో నాకు తెలియదు,” అని ఆమె ఆరోపించింది. ఫిర్యాదు ఆధారంగా, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 341, 323 , 294,354 కింద నమోదు చేయబడింది. ఈ విషయమై ఖరవేల నగర్ పోలీస్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ రజనీకాంత్ మిశ్రా మాట్లాడుతూ.. నిందితుడిపై ప్రాథమికంగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Payal Ghosh:బాలయ్యను చూసి నేర్చుకోవాలి.. బాలీవుడ్ హీరోలకి ఊసరవెల్లి భామ చురకలు!

ఆ తర్వాత నిందితుడిని అరెస్టు చేశామని అన్నారు. అలాగే ఇప్పుడు జర్నలిస్ట్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసామని, అన్ని చట్టపరమైన విధానాలు బట్టి ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఇక అరెస్టు చేసిన తర్వాత నాయక్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బెయిల్ కోసం అప్ప్లై చేసుకోగా బెయిల్ పిటిషన్‌ను సోమవారం విచారించాలని కోర్టు నిర్ణయించింది, ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ఇక గతంలో ఈ ఆరోపణలను ఖండించారు నాయక్. ఆమె ఆరోపణలు అబద్ధమని, కల్పితమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. “ఆమె గేటు మధ్యలో నిలబడి ఉన్నప్పుడు, నేను ఆమెను చిన్నగా తట్టి నాకు స్థలం ఇవ్వమని అడిగా, నేను ఆమెను కొట్టే ఉద్దేశ్యంతో లేదా ఆమెతో వేరే ఉద్దేశంతో అలా కొట్టలేదని అన్నారు. ఆమెను బాధపెడితే క్షమించండి అని అంటూ పేర్కొన్నారు. అయితే ఈ సంఘటనను సుమోటోగా పరిగణిస్తూ, ఒడిశా స్టేట్ కమీషన్ ఫర్ ఉమెన్ (OSCW) నవంబర్ 20లోగా పోలీసుల నుండి వివరణాత్మక నివేదికను కోరింది.