Producer Arrested: మహిళా జర్నలిస్టుతో అసభ్య ప్రవర్తన.. సినీ నిర్మాత అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odiya Producer Sanjay Nayak Arrested For Allegedly Assaulting Female Journalist: మహిళా జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో ఒడియా చిత్ర నిర్మాత సంజయ్ నాయక్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శుక్రవారం జరిగిన ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో టూటూ నాయక్‌గా పేరున్న చిత్రనిర్మాత తనను వెనుక భాగం మీద కొట్టి నవ్వుతూ అసభ్యంగా ప్రవర్తించాడు అని ఖారవేల నగర్ పోలీస్ స్టేషన్‌లో మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేసింది. నా చేతిలో నుండి నా మైక్, మొబైల్ ఫోన్ పడిపోయింది. నేను అవి తీసుకోవడానికి కిందకి వంగినప్పుడు ఆయన నా వీపుపై కొట్టాడు, అతను ఎందుకు అలా ప్రవర్తించాడో నాకు తెలియదు,” అని ఆమె ఆరోపించింది. ఫిర్యాదు ఆధారంగా, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 341, 323 , 294,354 కింద నమోదు చేయబడింది. ఈ విషయమై ఖరవేల నగర్ పోలీస్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ రజనీకాంత్ మిశ్రా మాట్లాడుతూ.. నిందితుడిపై ప్రాథమికంగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Payal Ghosh:బాలయ్యను చూసి నేర్చుకోవాలి.. బాలీవుడ్ హీరోలకి ఊసరవెల్లి భామ చురకలు!
Also Read
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ఆ తర్వాత నిందితుడిని అరెస్టు చేశామని అన్నారు. అలాగే ఇప్పుడు జర్నలిస్ట్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసామని, అన్ని చట్టపరమైన విధానాలు బట్టి ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఇక అరెస్టు చేసిన తర్వాత నాయక్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బెయిల్ కోసం అప్ప్లై చేసుకోగా బెయిల్ పిటిషన్‌ను సోమవారం విచారించాలని కోర్టు నిర్ణయించింది, ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ఇక గతంలో ఈ ఆరోపణలను ఖండించారు నాయక్. ఆమె ఆరోపణలు అబద్ధమని, కల్పితమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. “ఆమె గేటు మధ్యలో నిలబడి ఉన్నప్పుడు, నేను ఆమెను చిన్నగా తట్టి నాకు స్థలం ఇవ్వమని అడిగా, నేను ఆమెను కొట్టే ఉద్దేశ్యంతో లేదా ఆమెతో వేరే ఉద్దేశంతో అలా కొట్టలేదని అన్నారు. ఆమెను బాధపెడితే క్షమించండి అని అంటూ పేర్కొన్నారు. అయితే ఈ సంఘటనను సుమోటోగా పరిగణిస్తూ, ఒడిశా స్టేట్ కమీషన్ ఫర్ ఉమెన్ (OSCW) నవంబర్ 20లోగా పోలీసుల నుండి వివరణాత్మక నివేదికను కోరింది.
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!