Site icon NTV Telugu

October Progress Report: అక్టోబర్ ‘కాంతార’దే..!!

Kantara Movie

Kantara Movie

October Progress Report: అక్టోబర్ మాసంలో తెలుగులో మొత్తం 29 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 7 అనువాద చిత్రాలు ఉన్నాయి. విశేషం ఏమంటే దసరా, దీపావళి సందర్భంగా పలు చిత్రాలు ఆయా వారాలలో విడుదలయ్యాయి. అయితే తెలుగు స్ట్రయిట్ చిత్రాలకంటే అనువాద చిత్రమైన ‘కాంతార’నే ఈ నెలలో విజయకేతనం ఎగరేసి అగ్రస్థానంలో నిలిచింది.

ఈ నెల ఒకటవ తేదీన ‘బలమెవ్వడు’ మూవీ విడుదలైంది. ఆ తర్వాత దసరా కానుకగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్‌’, నాగార్జున ‘ది ఘోస్ట్’, బెల్లంకొండ గణేష్ ‘స్వాతి ముత్యం’ చిత్రాలు వచ్చాయి. ‘గాడ్‌ ఫాదర్’ మొదటి రెండు రోజులు కాస్తంత హంగామా చేసినా ఆ తర్వాత ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ‘స్వాతి ముత్యం’కు గుడ్ టాక్ వచ్చినా థియేటర్లలో కలెక్షన్లు మాత్రం రాలేదు. ఇక నాగార్జున యాక్షన్ మూవీ ‘ది ఘోస్ట్’ ఏ స్థాయిలోనూ, ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. రెండోవారంలో ఏకంగా తొమ్మిది చిత్రాలు విడుదలైతే, అందులో రెండు అనువాద చిత్రాలు. ఈ రెండూ కన్నడ చిత్రాలే కావడం విశేషం. అందులో ఒకటైన ‘కాంతార’ అప్పటికే కన్నడనాట ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ తెలుగులో శరవేగంగా దీన్ని అనువదించి, 15వ తేదీ రిలీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ‘కాంతార’ చక్కని ఓపెనింగ్స్ రాబట్టింది. దాంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడమే కాకుండా హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి సక్సెస్ టూర్ కూడా మొదలెట్టాడు. అదే రోజున యష్ అనువాద చిత్రం ‘రారాజు’ వచ్చింది, కానీ ఎలాంటి సందడి చేయలేదు. ‘కాంతార’ హోరులో ఆ వారం మిగిలిన సినిమాలన్నీ వెలవెలబోయాయి.

Read Also: Korameenu: అందాల రాక్షసి చేతుల మీదుగా ‘కొరమీను’ మోషన్ పోస్టర్!

మూడోవారం ఏడు సినిమాలు వచ్చాయి. అందులో రెండు తమిళ అనువాద చిత్రాలైదే, మరొకటి ఆంగ్ల చిత్రం! ఆ వారంలో 19వ తేదీ ‘అమ్ము’ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. 20వ తేదీ ‘బ్లాక్ ఆడమ్’ వచ్చింది. 21వ తేదీ తమిళ చిత్రం ‘ఓమై కడవులే’ తెలుగు రీమేక్ ‘ఓరి దేవుడా’, ‘జిన్నా’, తమిళ అనువాద చిత్రాలు ‘ప్రిన్స్’, ‘సర్దార్’ వచ్చాయి. ఈ వీకెండ్‌‌లో కలెక్షన్ల పరంగా కార్తీ ‘సర్దార్’ మూవీ ఒక్కటే కాస్తంత సందడి చేసింది. మంచి అంచనాలతో వచ్చిన శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ వినోదాత్మక చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. అలానే ప్రముఖ కవి, రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ బయోపిక్ ‘కవి సమ్రాట్’ 22వ తేదీ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది.

Read Also: Samantha: షాకింగ్.. సమంతకు అరుదైన వ్యాధి

నాలుగో వారంలో దీపావళి పండగ రావడంతో ఏకంగా ఆ వారం 9 సినిమాలు విడుదలయ్యాయి. 25వ తేదీ హిందీ మూవీ ‘రామ్ సేతు’, మరాఠీ చిత్రం ‘హర హర మహాదేవ్’ జనం ముందుకు వచ్చాయి. అక్షయ్ కుమార్, సత్యదేవ్, జాక్విలైన్ ఫెర్నాండేజ్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రామ్ సేతు’ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరాఠీ చిత్రం ‘హర హర మహాదేవ్’ దీ అదే పరిస్థితి. ఆ తర్వాత వచ్చిన సినిమాలూ ఏవీ థియేటర్లకు జనాలను తీసుకు రాలేకపోయాయి. ఈ వారాంతంలోనే అలీ కీలక పాత్ర పోషించి నిర్మించిన ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇది మలయాళ చిత్రం ‘వికృతి’కి రీమేక్. అలానే రాజేంద్ర ప్రసాద్, నరసింహరాజు నటించిన ‘అనుకోని ప్రయాణం’ కూడా థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఇది 2007లో వచ్చిన చైనీస్ మూవీ ‘గెట్టింగ్ హోమ్’ ఇన్ స్పిరేషన్ తో తీసిన సినిమా. కానీ ఎలాంటి హోప్‌ను ఆడియెన్స్‌కు ఆ మూవీ ఇవ్వలేకపోయింది. భారీ బడ్జెట్ తో పాటు మీడియం, స్మాల్ బడ్జెట్ చిత్రాలు ఈ వారం విడుదలైనప్పటికే అనువాద చిత్రం ‘కాంతార’ ఒక్కటే కమర్షియల్ హిట్‌ను సాధించింది.

Exit mobile version