Site icon NTV Telugu

O Saathiya : ‘ఓ సాథియా’కి ఓటీటీ ఆడియన్స్ ఫిదా

O Saathiya Movie Review

O Saathiya Movie Review

‘O Saathiya’ surpasses 50 million streaming minutes: అర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా విజయేంద్ర ప్రసాద్ శిష్యురాలు దివ్య భావన దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ “ఓ సాథియా”. ఈ సినిమా జూలై 7వ తారీఖున రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయి యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షించగా ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఏకంగా ఆరు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. తన్విక జశ్విక క్రియేషన్స్ పతాకం పై అర్యాన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా చందన కట్ట నిర్మించిన ఈ సినిమాకి స్ట్రీమింగ్ అవుతుంటున్న మొదటి రోజు నుంచే ఓటిటి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని సినిమా యూనిట్ వెల్లడించింది ఇప్పటికి 50 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ తో దూసుకుపోతోందని, కేవలం తెలుగు భాషలోనే కాకు ఇతర భాషల్లో కూడా మంచి వ్యూస్ సంపాదించుకుందని యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది.

Mukesh Udeshi: సినీపరిశ్రమలో తీవ్ర విషాదం.. చిరంజీవి సినిమాల నిర్మాత మృతి!

ఓ సాథియా ఒక అందమైన ఎమోషనల్ ప్రేమ కథ అని, ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా అని ముఖ్యంగా యూత్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని ఆ కారణంతోనే అమెజాన్ ప్రైమ్ లో మంచి వ్యూస్ సాధించి ట్రేండింగ్ లో ఉందని మేకర్స్ అన్నారు. ఓ సాథియా చిత్రాన్ని థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ లో మీకు నచ్చిన భాషలో చూడమని వెల్లడించారు. ఇక ఈ సినిమాకి ఈజే వేణు కెమెరామెన్‌గా పని చేయగా విన్ను సంగీతాన్ని అందించారు. హీరో ఆర్యాన్, దీపు ఈ సినిమాకి కథ అందించడం గమనార్హం. భాస్కర భట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల సాహిత్యాన్ని సమకూర్చగా రఘు మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్, యానీ మాస్టర్లు కొరియోగ్రఫీ చేశారు.

Exit mobile version