Site icon NTV Telugu

NV Prasad : పవన్ కళ్యాణ్ పై కాదు… థియేటర్ల వ్యవస్థ పై దాడి

nv-prasad

ఏపీలో థియేటర్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్కడి చాలా థియేటర్లలో రూల్స్ పేర్లతో ‘భీమ్లా నాయక్’ ప్రదర్శితం కాకుండా అడ్డుకుంటున్నారని నెటిజన్లు అంటున్నారు. పైగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం కొన్ని థియేటర్ల దగ్గర పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కన్పించడం చర్చనీయంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపి ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై కాదు… థియేటర్ల వ్యవస్థ పై దాడి అంటూ మండిపడ్డారు.

Read Also : Bheemla Nayak : హిందీ రిలీజ్ పోస్ట్ పోన్… రీజన్ ఇదే !

తాజాగా మీడియాతో మాట్లాడిన ఎన్వీ ప్రసాద్ థియేటర్ల వ్యవస్థ మీద దాడి చాలా కలిచివేస్తోందని, తమిళనాడు నుంచి ఎంతో కష్టపడి ఇండస్ట్రీని ఇక్కడకు తీసుకువచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జిబిటర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వానికి చాలా సార్లు విన్నవించాము. మంత్రి నానిని కలిసి మా బాధలు చాలా సార్లు చెప్పాము. కరోనా నుంచి రికవరీ అవుతుండగా, ఇప్పుడు మళ్లీ ఇలా దాడి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం థియేటర్ల వ్యవస్థ పై దాడి చేస్తోంది. ఇది పవన్ కళ్యాణ్ పై దాడి కాదు… ఈ వ్యవస్థపై దాడి. ఎగ్జిబిటర్లు మరో వ్యాపారం చూసుకోవాలి. అధికారులను థియేటర్లకు పంపి ఇబ్బందులు పెడుతున్నారు అంటూ మండిపడ్డారు.

Exit mobile version