Site icon NTV Telugu

Nushrratt : నన్ను కాదని అనన్య పాండేను తీసుకున్నారు : స్టార్ హీరోయిన్

Nushratt

Nushratt

Nushrratt : బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ తాజాగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. తనను కాదని తన సినిమా సీక్వెల్ లో అనన్య పాండేను తీసుకోవడం బాధనిపించిందంటూ తెలిపింది. ఆమె చేసిన తాజా కామెంట్స్ బాలీవుడ్ లో సెన్సేషన్ అవుతున్నాయి. అనన్య పాండే గతంలో లైగర్ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో కనిపించకుండా పోయింది. ఇప్పుడు కేవలం బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది ఈ భామ. అలాంటి అనన్య పాండే తన అవకాశాన్ని కొట్టేసిందంటూ బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : Vaishnavi Chaitanya: పాపం.. వైష్ణవి మీద పడితే ఏం లాభం?

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘నేను నటించిన సినిమాకు సీక్వెల్ గా వచ్చిన డ్రీమ్ గర్ల్ 2 సినిమాలో నన్నే తీసుకుంటారని ఎంతో నమ్మకం పెట్టుకున్నాను. కానీ నన్ను వద్దని అనన్య పాండేను తీసుకోవడం చాలా బాధగా అనిపించింది. అవతలిర వారి నిర్ణయాలను మనం కంట్రోల్ చేయలేం కదా. అందుకే బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయాను’ అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2023లో వచ్చిన డ్రీమ్ గర్ల్ 2 సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా, అనన్య పాండే కలిసి నటించారు.

Exit mobile version