ప్రస్తుతం టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత ఉందా..? అంట కొంతమంది నిజం అంటున్నారు.. ఇంకొంతమంది అదేం లేదంటున్నారు. స్టార్ హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. దీంతో కొత్తవారిపై నిర్మాతల కన్ను పడుతుంది. దీంతో టాలీవుడ్ లో ప్రస్తుతం కుర్ర హీరోయిన్ల హవా సాగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి కొత్తవారిని తీసుకొస్తున్నారు టాలీవుడ్ మేకర్స్. ఇక తాజాగా మరో బాలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. వన్ నేనొక్కడినే చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి మెప్పించిన కృతి సనన్.. తన చెల్లిని కూడా టాలీవుడ్ లో దింపుతోంది.
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నుపూర్ సనన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు మేకర్స్. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్నీ చిత్రబృందం అధికారికంగా వెల్లడిస్తూ చిత్రంలోకి నుపూర్ ని ఆహ్వానించింది. మ్యూజిక్ ఆల్బమ్స్ తో ఫెమస్ అయిన ఈ ముద్దుగుమ్మ వెండితెర ఎంట్రీ తెలుగులోనే ఇస్తుంది. కృతి సనన్ కూడా వన్ నేనొక్కడినే తోనే చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. దీంతో అక్కేమో మహేష్ తో.. చెల్లెమో రవితేజతో ఎంట్రీ ఇస్తుంది అన్నమాట. మరి అమ్మడు అక్కలా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.
