NTV Telugu Site icon

NTV Film Roundup: పబ్బులో మహేష్, శ్రీ లీల.. యాడ్ ఫిలిం షూట్ లో పుష్ప రాజ్?

Tollywood Shooting Updates

Tollywood Shooting Updates

NTV Film Roundup: Telugu Movie Shooting Updates 11th December 2023: తెలుగు సినిమాల షూటింగ్ ఎంతవరకు వచ్చింది అని తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. నిజానికి పెద్ద సినిమాల షూటింగ్స్ తో పాటు చిన్న సినిమాల షూటింగ్స్ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున్న జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ఏయే సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి అనే వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1. Guntur Karam – Mahesh Babu, Sreeleela : మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ లో మహేష్ బాబు- శ్రీ లీల మధ్య పబ్ సీన్స్ జరుగుతున్నాయి.
2. Family Star – ఇక విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అమెరికాలోని న్యూ యార్క్ లో జరుగుతోంది. విజయ్-మృణాల్ మధ్య సీన్స్ షూట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Producer SKN : ఈసారి కల్ట్ బొమ్మే అంటున్న ఎస్కేఎన్

3. The Girlfriend – రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ది గర్ల్ ఫ్రెండ్, ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు హైదరాబాదా లో శరవేగంగా జరిగుతోంది. యానిమల్ సినిమాతో హిట్ అందుకున్న రష్మిక ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది.
4. Geethanjali 2 : అంజలి హీరోయిన్ గా నటించిన గీతాంజలి సినిమా సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు గీతాంజలి 2 పేరుతొ తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ఊటీలో జరుగుతోంది.
5. Allu Arjun: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ఒక యాడ్ ఫిలిం షూటింగ్ లో పాల్గొంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ యాడ్ షూట్ జరుగుతోంది.

Show comments