Simhadri: 4Kలో వస్తున్న కేరళ సింగమలై… రికార్డులు లేవడం గ్యారెంటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ ని చరిత్రలో కొన్ని పేజీలు ఉండేలా చేసిన సినిమా ‘సింహాద్రి’. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ సింహాద్రి. కేరళ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ని సింగమలైగా చూపిస్తూ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. సరిగ్గా మీసాలు కూడా లేని ఎన్టీఆర్ ని సింహాద్రి సినిమా సూపర్ స్టార్ ని చేసింది. ఇండియాలో ఆ టైంలో ఎన్టీఆర్ కి ఉన్న వయసులో, ఆ స్థాయి మాస్ ఇమేజ్ ఏ హీరోకి లేదు అనడంలో అతిశయోక్తి లేదు. రజినీకాంత్ అంతటి వాడు సింహాద్రి సినిమా చూసి “ఈ కుర్రాడు చిన్న వయసులో ఇలాంటి పవర్ ఫుల్ రోల్స్ చేస్తున్నాడు ఏంటి?” అన్నాడు అంటే సింహాద్రి సినిమాలో రాజమౌళి ఎన్టీఆర్ ని ఏ రేంజులో ప్రెజెంట్ చేశాడో అర్ధం చేసుకోవచ్చు. సింహాద్రి అప్పన్న గుడి దెగ్గర ఓపెన్ అయ్యి కేరళ వెళ్లి అక్కడ నుంచి గోదావరి పుష్కరాలకి వచ్చి రాజమౌళి ఇచిన ఇంటర్వెల్ బ్లాక్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తెరపై సింగమలై అన్నా అనే అరుపు వినగానే థియేటర్స్ లో ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ వస్తాయి.
హెవీ యాక్షన్ ఎపిసోడ్ జరగుతున్న సమయంలో భూమికతో ఎన్టీఆర్ పోడిపించి రాజమౌళి బాహుబలి ది బిగినింగ్ సినిమా ఎండింగ్ ని సింహాద్రికి ఇంటర్వెల్ కే చూపించాడు. సింహాద్రి ఇంటర్వెల్ సీన్ చూసిన తర్వాత ఆడిటోరియం మొత్తం సైలెంట్ అయిపొయింది. ఇక సెకండ్ హాఫ్ లో ఆంధ్రా సింహాద్రి కాస్త కేరళ సింగమలైగా మారి అక్కడి రౌడీలని ఎదిరించి, అక్కడ డాన్ గా ఎదిగే విధానం సూపర్ ఉంటుంది. నాటు నాటు సాంగ్ తో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్న కీరవాణి, సింహాద్రి టైటిల్ సాంగ్ ని అద్భుతంగా ఇచ్చాడు. ఈ టైటిల్ సాంగ్ కి, రాజమౌళి టేకింగ్ కి, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్ థియేటర్స్ లో రచ్చ చేశారు. మరోసారి ఇలాంటి రచ్చనే చెయ్యడానికి ఎన్టీఆర్ ఫాన్స్ రెడీ అవుతున్నారు. సింహాద్రి సినిమా 4K వర్షన్ లో రీరిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 2003 జూలై 9న సింహాద్రి సినిమా రిలీజ్ అయ్యింది అంటే ఈ జూలైకి సింహాద్రి రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అవుతుంది. మరి 20 ఇయర్స్ కంప్లీట్ అయ్యేవరకూ ఆగుతారా? లేక సింహాద్రి సినిమాని ముందే రీరిలీజ్ చేస్తారా అనేది చూడాలి. సింహాద్రి సినిమా ఎప్పుడు రీరిలీజ్ అయినా అన్ని సినిమాల రీరిలీజ్ రికార్డులు ఎగిరిపోవడం గ్యారెంటీ.
Also Read
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!