NTR Neel : ‘డ్రాగన్’ ఇంటర్వెల్ ఎపిసోడ్.. నెవర్ బిఫోర్ ఇన్ టాలీవుడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్‘. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే రేంజ్లో ప్రశాంత్ నీల్ ఒక మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్.
సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఇంటర్వెల్ బ్లాక్స్ ఏ రేంజ్లో ఉంటాయో ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలతోనే రుజువైంది. అయితే ‘డ్రాగన్’ కోసం అంతకుమించి అనేలా అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను డిజైన్ చేస్తున్నారట. ఈ ఎపిసోడ్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక ఊహించని విజువల్ ఫీస్ట్‌లా మారబోతుందని సమాచారం. మరోవైపు ఈ సినిమా విజువల్స్ పరంగా ప్రశాంత్ నీల్ తన మార్క్ స్టైల్‌ను పక్కన పెట్టి ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడట నీల్. రెగ్యులర్ గా నీల్ సినిమాల్లో కనిపించే సిగ్నేచర్ డార్క్ థీమ్ గ్రే షేడ్స్ కాకుండా.. ‘డ్రాగన్’ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మొత్తం చాలా కలర్ఫుల్గా, వైబ్రంట్ విజువల్ ప్యాలెట్‌తో రిచ్‌గా ఉండబోతున్నాయట. ఈ కలర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్ కథకు ఒక ప్రత్యేకమైన వేరియేషన్‌ను తీసుకురానుందని టాక్. ఇక ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలోని మెయిన్ కాన్ఫ్లిక్ట్ చుట్టూ బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతి సనన్ క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతుందట. కథను పూర్తిగా మలుపు తిప్పే ఒక అత్యంత కీలకమైన పాత్రలో కృతి కనిపించనుందని సినిమాలో ఆ క్యారెక్టరే మెయిన్ పిల్లర్ అని వినికిడి. మైథ్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?