NTR30 Movie Shooting To Start From November: జూ. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తోన్న ఆ సమయం రానే వచ్చేసింది. కొరటాలతో అతను చేయబోతున్న తదుపరి చిత్రం NTR30 సినిమా షూటింగ్‌కి ముహూర్తం ఖరారైంది. స్క్రిప్టు పనులు పూర్తైన నేపథ్యంలో.. మిగిలిన ప్రీ-ప్రొడక్షన్ పనులు త్వరగా ముగించుకొని, నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక భారీ సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఏ రోజు నుంచి షూటింగ్ మొదలుపెట్టాలన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇండస్ట్రీలో వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. ఎప్పట్నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారన్న తేదీని ఈ నెలాఖరులో అధికారికంగా వెల్లడించనున్నారట! అదే నిజమైతే.. తారక్ అభిమానులకు ఇది పండగలాంటి వార్తే!
నిజానికి.. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్లాల్సింది. అయితే, ఆర్ఆర్ఆర్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఆ సినిమా పుణ్యమా అని, తారక్‌కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. దీంతో.. NTR30ని కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందించాలని మేకర్స్ నిర్ణయించారు. అందుకు తగ్గ కథని తయారు చేయడం కోసమే, ఇన్నాళ్ల సమయం పట్టింది. ప్రస్తుతానికైతే ఈ కథ సిద్ధమైందని, నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం అవ్వడం పక్కా అనే వార్తలైతే వస్తున్నాయి. మరి, ఈసారైనా చెప్పిన సమయానికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారా? లేక మరింత ఆలస్యం చేస్తారా? అన్నది వేచి చూడాలి. కాగా.. ఇందులో కథానాయిక పాత్రలో కన్నడ బ్యూటీ రష్మిక మందణ్ణ నటించనుందని సమాచారం. ఇందులో కీలక పాత్రల కోసం ఇటు కోలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ నుంచి ప్రముఖ నటీనటుల్ని రంగంలోకి దింపేందుకు మేకర్స్ కసరత్తులు చేస్తున్నారు.
