NTV Telugu Site icon

NTR30: ఫ్యాన్స్‌కి ‘పండగ’లాంటి వార్త.. సెట్స్ మీదకి వెళ్లేది అప్పుడే!

Ntr30 Shoot Muhurtham

Ntr30 Shoot Muhurtham

NTR30 Movie Shooting To Start From Febraury: ‘ఎన్టీఆర్30’ సినిమా ప్రకటన అప్పుడెప్పుడో భూమి పుట్టినప్పుడు వచ్చింది. కానీ.. ఇంతవరకు ఇది సెట్స్ మీదకి వెళ్లలేదు. అదిగో అప్పుడు, ఇదిగో ఇప్పుడు అని చెప్పి పలుసార్లు ఊరించి.. ఆ తర్వాత ఉసూరుమనిపించారు. మధ్యలో కొన్నాళ్లు ఎలాంటి అప్డేట్ లేకపోయేసరికి, ఈ ప్రాజెక్ట్ రద్దు అయ్యిందనే పుకార్లు సైతం పుట్టుకొచ్చేశాయి. కానీ.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని చిత్రబృందంతో తాను చర్చిస్తున్న ఫోటోలతో కొరటాల తిరస్కరించాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేదే అతిపెద్ద మిస్టరీగా మారింది. అయితే.. ఇప్పుడా సస్పెన్స్‌కి తెరపడింది. ఈ సినిమా షూటింగ్‌కి చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసినట్టు లేటెస్ట్‌గా ఒక అప్డేట్ తెరమీదకి వచ్చింది.

Chinmayi Sripada: చిన్మయి మరో బాంబ్.. ఆయన మంచోడు కాదు

సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం.. సంక్రాంతి రోజు ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారట! అనంతరం ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారని సమాచారం. ఇందుకోసం మేకర్స్ ఆల్రెడీ ప్రీ-ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న తారక్.. అక్కడి నుంచి తిరిగి రాగానే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించునున్నట్టు తెలిసింది. ఇక షూటింగ్ స్టార్ట్ చేశాక, ఎలాంటి గ్యాప్‌లు తీసుకోకుండా ఏకధాటిగా షూట్ నిర్వహించేలా కొరటాల పక్కా షెడ్యూల్స్ ప్లాన్ చేశాడని అంటున్నారు. ఒకవేళ పనులన్నీ అనుకున్నట్టు సవ్యంగా జరిగితే.. వచ్చే ఏడాదిలోనే సినిమా రిలీజ్ ఉండనున్నట్టు చెప్తున్నారు. ఇదే నిజమైతే మాత్రం.. ఫ్యాన్స్‌కి పండగే! ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న వారి నిరీక్షణకు ఫుల్ స్టాప్ పడినట్టే! అయితే.. దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Upasana Konidela: బేబీ బంప్‌తో మెగా ఇంటి కోడలు.. ఫోటోలు వైరల్

Show comments