Site icon NTV Telugu

NTR 30: భయపెట్టడానికి వస్తున్నా.. తారక్ గర్జన మొదలు

Ntr

Ntr

‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రపంచానికి తన సత్తా ఏంటో  చూపించాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్ అన్నట్లు ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా  ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల వర్షం కురిపించింది. ఈ సినిమా విజయంతో జోష్ పెంచేసిన ఎన్టీఆర్ తన సెక్స్ సినిమాను కొరటాలతో మొదలు పెట్టేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొద్దిరోజుల్లో పూజా కార్యక్రమాలను ముగించుకొని సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక  రేపు( మే 20 ) ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేసి ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

“అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి.. తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా” అంటూ ఎన్టీఆర్ బేస్ వాయిస్ తో చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ ను తెప్పిస్తోంది. ఇక వీడియో లో సముద్రపు అలలు.. వాటిలో నుంచి రెండు చేతులలో కత్తి, గొడ్డలి పట్టుకొని, రక్తం తో తడిసిన ఎన్టీఆర్ షాడో కనిపించడం అదరగొట్టింది. ఇక అనిరుదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వీర లెవల్ అని చెప్పాలి. వెరసి ఈ చిన్న వీడియోతోనే సినిమాపై అంచనాలను ఆకాశానికి ఎత్తేశారు మేకర్స్.. ఇక ఈ సినిమాకు సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తుండగా.. డీఓపీ గా రత్నవేలు,  శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  అయితే సినిమా టైటిల్ కూడా ప్రకటించి ఉంటే బావుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి రేపు ఏమైనా మరో  సర్ ప్రైజ్ ప్లాన్ చేసారేమో చూడాలి.

 

Exit mobile version