Devara:ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది.. అని పాడుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. జనతా గ్యారేజ్ లాంటి హిట్ సినిమా తరువాత ఎన్టీఆర్- కొరటాల కాంబో అనేసరికి అభిమానుల అంచనాలు ఆకాశానికి తాకాయి. ఇక ఆ అంచనాలను ఏ మాత్రం తగ్గించకుండా కొరటాల.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రేపు ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఈరోజు ఎన్టీఆర్ 30 నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ను కూడా రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు.
గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ సైతం దేవర అనే టైటిల్ నే ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ అయితే ఫ్యాన్స్ చొక్కాలు చించేసుకొనేలా కనిపిస్తుంది. సముద్రంలో అన్ని అతని కథలే.. రక్తంతో రాసినవి అని చెప్పినట్లుగానే సముద్ర వీరుడు రక్తంతో తడిచిన భీకర రూపంలో దర్శనమిచ్చాడు. సముద్రం ఒడ్డున అలలు ఎగిసి పడుతుండగా..గుట్టల గుట్టల శవాల మధ్య దేవరగా ఎన్టీఆర్ లుక్ నభూతో నభవిష్యత్ లా కనిపిస్తుంది. బ్లాక్ షర్ట్ బ్లాక్ లుంగీ పై కండువా.. చేతిలో రక్తంతో తడిచిన ఈటె పట్టుకొని ఊర మాస్ లుక్ లో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు.. ఎన్టీఆర్ ను ఎలా చూడాలనుకున్నారో కొరటాల.. ఎన్టీఆర్ ను అలాగే దించేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023