NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏది ఎందుకు, ఎప్పుడు వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు వచ్చిందో, ఎలా తెరమీదకు వచ్చిందో తెలియదు కానీ, సీనియర్ ఎన్టీఆర్ “మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది” అని చెబుతున్న ఒక వీడియో వైరల్ అవుతోంది. దాన్ని ఏకంగా ‘కొరియన్ కనకరాజు’ సినిమాలో వాడుకున్నారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇది కరెక్ట్ కాదని అంటుంటే, ఇది ఆయన్ని ట్రోల్ చేయడం కాదని, ఇమిటేట్ చేయడమే కాబట్టి తాము కించపరిచే ఉద్దేశంతో చేయలేదని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. అసలు “మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది” అనే ఈ సీన్ ఏ సినిమాలోదో, దాని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం!
ఈ సూపర్ హిట్ సీన్ వైజయంతీ మూవీస్ పతాకంపై కె. బాపయ్య దర్శకత్వంలో, సి. అశ్విని దత్ నిర్మించిన ‘యుగపురుషుడు’ (1978) చిత్రంలోనిది. ఇందులో కరాటే ఫైటర్ రాజేష్ పాత్రలో ఎన్టీఆర్, చంద్రమోహన్ మధ్య వచ్చే కరాటే ఫైట్ సీన్ ఇప్పటికీ సినీ అభిమానులకు ఒక మాస్టర్ పీస్. కరాటే ఫైటర్ అయిన రాజేష్ (ఎన్.టి.ఆర్), తన తండ్రి మారుతీరావు (కైకాల సత్యనారాయణ) కోరిక మేరకు ఒక జమిందారు (ప్రభాకర్ రెడ్డి) కోల్పోయిన మనువడు ‘కళ్యాణ్’ స్థానంలోకి వెళ్ళడానికి అంగీకరిస్తాడు. అయితే, రాజేష్‌ను ప్రాణంగా ప్రేమించిన లత (జయప్రద), అతడు డబ్బు కోసం ఇలా నకిలీ మనవడిగా మారాడని భావించి అపార్థం చేసుకుంటుంది.
Also Read
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
జమిందారు ప్రాణాలకు ఉన్న ప్రమాదాన్ని గ్రహించి, ఆయనను కాపాడటానికే తాను ఈ నాటకం ఆడుతున్నానని లతకు వివరిస్తాడు రాజేష్. అయితే ఈ క్రమంలోనే ఒక పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. తన చిన్నాన్న జగ్గు (జగ్గయ్య) ద్వారా నిజానికి తానే అసలైన కళ్యాణ్ అనే షాకింగ్ నిజం రాజేష్‌కి తెలుస్తుంది. దీంతో విలన్ల ప్లాన్స్ అన్నీ తిప్పికొట్టి, వాళ్ళ ఆట కట్టించి, విడిపోయిన తన తల్లిని, తాతను ఒకటి చేస్తాడు. చివరకు తన మరదలు లతను పెళ్ళిచేసుకోవడంతో కథ శుభం కార్డుతో ముగుస్తుంది. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కె.వి. మహదేవన్ అందించిన మాస్ మ్యూజిక్ మరియు కరాటే బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన డిఫరెంట్ యాక్షన్ సీన్స్ ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించేలా చేశాయి.
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!