NTV Telugu Site icon

HCA: ఎన్టీఆర్ ని పిలిచాము కానీ రాలేదు – హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్

Hca

Hca

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెజెంట్ చేసే అవార్డ్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా నాలుగు కేటగిరిల్లో అవార్డ్స్ ని సొంతం చేసుకోని ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త చరిత్రని సృష్టించింది. స్పాట్ లైట్ అవార్డుని కూడా గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ముందెన్నడూ చూడని ఒక హిస్టీరియా క్రియేట్ చేస్తోంది. ఈ HCA అవార్డ్స్ ఈవెంట్ లో రామ్ చరణ్, అవార్డ్ ప్రెజెంట్ చేసి ఆ ఘనత సాదించిన మొదటి భారతీయ నటుడిగా చరిత్రకెక్కాడు. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ కి అన్యాయం జరిగింది, తారక్ ని ఎందుకు పిలవలేదు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఇది కాస్త చిలికి చిలికి గాలి వానగా మారడంతో హకస్వయంగా స్పందించింది. ఎన్టీఆర్ ని ఎందుకు పిలవలేదు అనే విషయంలో క్లారిటీ ఇస్తూ “స్పాట్ లైట్ అవార్డ్ అనేది ఒక యాక్టర్ ని వచ్చింది కాదు, అది ఆర్ ఆర్ ఆర్ సినిమాకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ని మేము ఇన్వైట్ చేశాము కానీ అతను ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే HCA ఈవెంట్ కి రాలేదు.

ఎన్టీఆర్ అవార్డ్ త్వరలోనే అందుకుంటాడు” అంటూ HCA వాళ్లు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా లేడు, తన బ్రదర్ చనిపోయి, పర్సనల్ లాస్ లో ఉన్నాడు అందుకే రాలేదు అని ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకరు HCA ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్ కి కూడా హాలీవుడ్ క్రిటిక్స్ స్పందించింది. “ఎన్టీఆర్ తన సినిమా పనుల్లో ఉండే అవార్డ్స్ ఈవెంట్ కి రాలేదు, ఆ తర్వాతే తన బ్రదర్ చనిపోయాడు. ఈ విషయం మాకు ఎన్టీఆర్ పబ్లిసిస్ట్ చెప్పాడు” అని క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 24న ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలు జరగాల్సి ఉంది, తారకరత్న మరణంతో ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ సెరిమొని వాయిదా పడింది. దీంతో ఎలాంటి అనౌన్స్మెంట్ ఈవెంట్స్ లేకుండానే ఎన్టీఆర్, కొరటాల శివ షూటింగ్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. మార్క్ 5న ఎన్టీఆర్ మళ్లీ యూఎస్ వెళ్తాడు, ఆ సమయంలో తన అవార్డుని HCA నుంచి ఎన్టీఆర్ అందుకోనున్నాడు.