ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై భారీ ఎత్తున నిర్మించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫినిష్ అయిన వెంటనే తారక్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నాడు నిర్మాత నాగావంశి.
Also Read : WAR 2 : వార్ 2.. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కు స్క్రీన్స్ చిరిగిపోతాయి : నాగవంశీ క్జ్మ్హ్ . ,
అయితే ఈ సినిమాకు సంబందించి అనౌన్స్మెంట్ చేయాలనీ నాగవంశీ దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేశారట. ఈ విషయమై నాగావంశి మాట్లాడుతూ ‘ త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ముందు మేము ఒక స్కేల్ లో అనుకుని రిలీజ్ చేయాలని భావించాం. కానీ ఇటీవల బాలీవుడ్ నుండి వచ్చిన రామాయన్ గ్లిమ్స్ వచ్చాక మా ప్లాన్స్ ను విరమించుకున్నాం. మా బ్యానర్ లో మా దర్శకులు త్రివిక్రమ్ గారు తొలిసారి మైథలాజికల్ సినిమా చేస్తున్నారు అంటే ఎలా ఉండాలి. అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారిని రాముడిగా, కృష్ణుడిగా చుసిన నాకు జూనియర్ ఎన్టీఆర్ ను దేవుడిగా చూపించబోతున్నాను అనే ఆనందం నాకు ఉంటుంది కదా సో రామాయణ గ్లిమ్స్ ను ఇండియా అంతా మాట్లాడుకున్నారు. ఇప్పుడు మనం చేయబోయే సినిమా అంతకు మించి మాట్లాడుకోవాలి అనే కారణంగా త్రివిక్రమ్ కాస్త టైమ్ తీసుకుని అనౌన్సమెంట్ ఇద్దాము అని చెప్పడంతో ఆగాము. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ నుండి త్రివిక్రమ్, తారక్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని అన్నారు.
