NTV Telugu Site icon

NTR Trivikram: మళ్లీ మాటల మాంత్రికుడితో యంగ్ టైగర్…

Ntr Trivikram

Ntr Trivikram

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీకి ఫిదా అవ్వని ఆడియన్స్ ఉండరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్ రైటింగ్ ని ఎంజాయ్ చెయ్యని ఆడియన్స్ కూడా ఉండరు. అందుకే ఎన్టీఆర్ లు త్రివిక్రమ్ లు కలిసి ఒక్క సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలని సినీ అభిమానులు కోరుకున్నారు. ఆ కోరికని నిజం చేస్తూ వచ్చిన సినిమానే ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ హిస్టరీలోనే ‘అరవింద సమేత వీర రాఘవ’ లాంటి హీరో ఇంట్రడక్షన్ సీక్వెన్స్ ఉండదు. ఈ హీరో ఇంట్రడక్షన్ సీన్ త్రివిక్రమ్ లాంటి దర్శకుడు యాక్షన్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూపించింది. ‘అరవింద సమేత’ సినిమాలోని మొదటి 40 నిముషాలు, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ‘ది బెస్ట్ ఫస్ట్ హాఫ్’ అనే చెప్పాలి.

యుద్ధం తర్వాతి పరిణామాల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో ఎన్టీఆర్ ఎమోషనల్ యాక్టింగ్ పీక్ స్టేజ్ లో ఉంటుంది. ముఖ్యంగా మాస్ హీరోని పెట్టుకోని క్లైమాక్స్ లో భారి ఫైట్ లేకుండా సాంగ్ తో ఎండ్ కార్డ్ వేసిన విధానం నిజంగా సాహసమే. ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ సీన్, ఫోన్ లో వార్నింగ్ ఇచ్చే సీన్, పీస్ మీటింగ్ సీన్, టార్చ్ బేరర్ డైలగ్… ఇలా అరవింద సమేత సినిమాలో తారక్ ఫాన్స్ ని నచ్చే విషయాలు చాలానే ఉన్నాయి. మూడేళ్ల పాటు తారక్ సినిమా రిలీజ్ అవ్వకపోయిన ఎన్టీఆర్ ఫాన్స్ లో జోష్ తగ్గలేదు అంటే ‘అరవింద సమేత వీర రాఘవ’ ఇచ్చిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ‘అరవింద సమేత’తో సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ త్రివిక్రమ్ లు వెంటనే ఇంకో సినిమాని అనౌన్స్ చేసి అభిమానులని ఖుషీ చేశారు. ‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తోనే సినిమా చేయాల్సి ఉంది కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లిపోయి, త్రివిక్రమ్ ప్లేస్ లోకి కొరటాల శివ వచ్చి చేరాడు.

#NTR30 సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో ఎవరికీ తెలియట్లేదు, ప్రశాంత్ నీల్ తో చేయాల్సిన #NTR31 కూడా డిలే అయ్యేలా ఉంది. ప్రశాంత్ నీల్ మార్చ్ నుంచి #NTR31 స్టార్ట్ చేయాల్సి ఉంది కానీ ‘సలార్’ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వచ్చే ఏడాది మార్చ్-ఏప్రిల్ వరకూ ‘సలార్’ సినిమా షూటింగ్ జరిగే అవకాశం ఉంది. ‘సలార్’ సినిమాని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించాలని మేకర్స్ భావిస్తున్నారు కాబట్టి ప్రభాస్ ప్రశాంత్ నీల్ ఇంకో ఏడాది పాటు కలిసి పని చేయడం గ్యారెంటీ. దీంతో #NTR31 డిలే అవ్వక తప్పట్లేదు. ఇలాంటి పరిస్థితిలో ఎన్టీఆర్ వెయిట్ చేయడం కన్నా, NTR 31 సినిమాని త్రివిక్రమ్ తో చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఇప్పటికే కలిసి చర్చలు చేస్తున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై  ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ కొరటాల శివ, త్రివిక్రమ్ మహేశ్ బాబు సినిమాలు దాదాపు ఒకేసారి షూటింగ్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. #SSMB28 షూటింగ్ అయిపోగానే #NTR31 సెట్స్ పైకి వెళ్తుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకి ‘అయిననూ పోయి రావలె హస్తినకూ’ అనే టైటిల్ ని కన్సిడర్ చేస్తున్నట్లు సమాచారం.