పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడి ప్రాణాలు చిలుకలో ఉందని విషయం తెలుగు ప్రేక్షకులకి ఎంత బాగా తెలుసో… “రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాత ఫ్లాప్ గ్యారెంటీ” అనేది కూడా అంతే బాగా తెలుసు. ఒక్కసారి రాజమౌళితో సినిమా చేస్తే, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో చేసినా, ఎంత భారి బడ్జట్ తో చేసినా అది ఫ్లాప్ అయ్యి తీరుతుంది. ప్రభాస్, చరణ్, నితిన్, నాని… ఇక ఒకరేంటి రాజమౌళితో ఎవరు హిట్ కొట్టినా నెక్స్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం పక్కా. ఈ సెంటిమెంట్ స్టార్ట్ అయ్యింది ఎన్టీఆర్ తోనే… స్టూడెంట్ నంబర్ 1 సినిమా నుంచి ఎన్టీఆర్-రాజమౌళిలు కలిసి వర్క్ చేస్తూనే ఉన్నారు. సింహాద్రి, యమదొంగ సినిమాల తర్వాత కూడా ఎన్టీఆర్ ఫ్లాప్స్ ఫేస్ చేసాడు. ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తర్వాత దేవర సినిమాతో ఎన్టీఆర్ ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి రానున్నాడు.
దేవర సినిమాతో ఎన్టీఆర్ హిట్ కొట్టి జక్కన్న సెంటిమెంట్ కి సాలిడ్ బ్రేక్ వేస్తాడు అనే మాట నందమూరి అభిమానుల్లో వినిపిస్తోంది. ఏ హీరోతో ఈ సెంటిమెంట్ మొదలయ్యిందో, అదే హీరోతో ఈ సెంటిమెంట్ కి బ్రేక్ వేస్తాం అంటున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. కొరటాల శివతో కలిసి పాన్ ఇండియా స్థాయిలో దేవర సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కొత్త వరల్డ్ సెట్ అయ్యి ఉంది. గ్లిమ్ప్స్ తో మేకర్స్ అంచనాలని అమాంతం పెంచేశారు. గ్లిమ్ప్స్ లోని బ్లడ్ మూన్ షాట్ కి ఇంటర్నెట్ మొత్తం షేక్ అయ్యింది. సినిమా టెక్నీకల్ గా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఈ కాన్ఫిడెన్స్ తోనే ఇన్నేళ్లుగా ఉన్న రాజమౌళి సెంటిమెంట్ ని సమ్మర్ లో మేము బ్రేక్ చేస్తాం అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ స్ట్రాంగ్ గా చెప్తున్నారు. మరి నందమూరి అభిమానుల నమ్మకాన్ని నిజం చేస్తూ రాజమౌళి సెంటిమెంట్ కి చరణ్ కన్నా ఎక్కువగా బలైన కొరటాల శివ, ఎన్టీఆర్ ని అయినా కాపాడుతాడేమో చూడాలి.
