Site icon NTV Telugu

NTR: పాన్ వరల్డ్ స్టార్ తో ఎన్టీఆర్… ఇది ఫిక్స్ అయినట్లేనా?

Ntr

Ntr

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ గా నటించి గ్లోబల్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వెస్ట్రన్ ఆడియన్స్ ఇంటర్వెల్ సీన్ లో ఎన్టీఆర్ ట్రక్ నుంచి దూకుతుంటే చూసి నోరెళ్లబెట్టి మరీ ఎంజాయ్ చేసారు. హాలీవుడ్ మీడియా కూడా ఎన్టీఆర్ తో స్పెషల్ ఇంటర్వూస్ చేసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తో జత కట్టిన ఎన్టీఆర్, తన నెక్స్ట్ సినిమాలో పాన్ వరల్డ్ స్టార్ ప్రియాంక చోప్రాతో కలిసి నటిస్తున్నాడు అనే వార్త తెగ వైరల్ అవుతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న వార్ 2 సినిమాలో హ్రితిక్ రోషన్ కి సాలిడ్ విలన్ గా ఎన్టీఆర్ నటించనున్నాడు. ఇటీవలే అఫీషియల్ గా హ్రితిక్ రోషన్ కన్ఫర్మేషన్ ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుందని బాలీవుడ్ మీడియా చెప్తోంది.

ఇంకో కథనం ప్రకారం, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 2024 మార్చ్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఎన్టీఆర్ 31 సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది అంటున్నారు. ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే ఇండియా వైడ్ బజ్ జనరేట్ అయ్యింది. వార్ 2, ఎన్టీఆర్ 31… ఈ రెండు సినిమాలో ఏ మూవీలో ప్రియాంక చోప్రా, ఎన్టీఆర్ పక్కన నటిస్తుందనే విషయం తెలియదు కానీ ఈ రెండు రూమర్స్ లో ఎన్టీఆర్-ప్రియాంక చోప్రా కాంబినేషన్ సెట్ అయ్యింది అనే వార్త మాత్రం కామన్ గా ఉంది. మరి ఇది కలయిక నిజమై ఏ సినిమాలో వీళ్లు కలిసి నటిస్తారు అనేది తెలియదు కానీ ఎన్టీఆర్ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తే మాత్రం ఆమెకి ఉన్న పాన్ వరల్డ్ ఇమేజ్, ఆ సినిమాకి కచ్చితంగా కలిసొచ్చే విషయమే.

Exit mobile version