NTV Telugu Site icon

NTR: నా మీద కక్ష కట్టి.. నాకు చిరాకు అని తెలిసినా అతను ఆ పని చేస్తున్నాడు

Rajeev

Rajeev

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్నేహానికి ప్రాణం ఇవ్వమన్న ఇచ్చే టైప్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ తానూ కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ ను వదలకుండా స్నేహాన్నీ కొనసాగిస్తున్నాడు. ఇక స్నేహం కోసం ఎంత తపిస్తాడో.. ఒక్కసారి వద్దు, కాదు అంటే వారి ముఖం కూడా చూడడు ఎన్టీఆర్. ఇక తారక్ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే అందులో నటుడు రాజీవ్ కనకాల పేరు మొదట.ఉంటుంది ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమాలో రాజీవ్ కనకాల కచ్చితంగా ఉంటాడు. ఇక టీడీపీకి ప్రచారం చేసిన సమయంలో తారక్ కు యాక్సిడెంట్ అయినప్పుడు.. ఫ్రెండ్సే దగ్గర ఉండి చూసుకున్నారు. అందుకే తారక్.. ఎప్పుడు వారిని వదిలిపెట్టడు. ఇక సినిమాలు కారణంగా బిజీగా ఉన్నా కూడా.. సమయం చిక్కినప్పుడల్లా ఫ్రెండ్స్ తో గడుపుతూ ఉంటాడు.

Vadhuvu Teaser: చిన్నారి పెళ్లి కూతురు.. ఇంకోసారి పెళ్లి కూతురుగా మారిందే

నేడు నవంబర్ 14 .. బాలల దినోత్సవం. ఈరోజుకు, ఎన్టీఆర్ కు సంబంధం ఏంటి అంటే.. రాజీవ్ కనకాల.. ఎన్టీఆర్ కు ఫ్రెండ్ గా ఉండడానికి కారణం అతని చిన్నపిల్లల మనస్తత్వం అని, అందుకే ప్రతి చిల్డ్రన్స్ డే కు విషెస్ చెప్తాడని.. ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఈరోజు ఆ పాత వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జనతా గ్యారేజ్ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మీకు తారక్ ఇంత నచ్చడానికి కారణం ఏంటి అని రాజీవ్ ను అడుగగా.. ” అతనిలో ఉన్న చైల్డిష్ మెంటాలిటీ.. అతనిలో ఉన్న ఆ గుణమే నాకు నచ్చుతుంది ” అని రాజీవ్ చెప్పగానే .. ఎన్టీఆర్.. ” అది వస్తుందనే అతనిని చెప్పొద్దూ అన్నాను. ప్రతి చిల్డ్రన్స్ డేకు రాజీవ్ నాకు హ్యాపీ చిల్డ్రన్స్ డే అని పంపిస్తాడు. నాకు అదేంత చిరాకుగా ఉంటుందో తెలిసి కూడా.. నా మీద కక్ష కట్టి మరీ ఆ రోజు మెసేజ్ చేస్తాడు. ఇప్పటికీ ఆ మెసేజ్ పంపిస్తూనే ఉంటాడు” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు సైతం నిజమే అంటూ.. చెప్పుకొస్తున్నారు.

Show comments