యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. RRR బ్లాక్ బస్టర్ హిట్ తో తారక్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదే జోష్ లో నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు RRRలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేసిన తారక్ అభిమానులు సోషల్ మీడియాలో NTR 30ని ట్రెండ్ చేస్తున్నారు. వాళ్ళను మరింత హుషారెత్తించడానికా అన్నట్టుగా ఎన్టీఆర్ తాజా ఇంటర్వ్యూలో NTR 30కి సమందించిన పలు కీలక విషయాలను వెల్లడించారు.
Read Also : Sarkaaru Vaari Paata : పని పూర్తి… మహేష్ లాంగ్ బ్రేక్ ?
RRR ఘనవిజయం సాధించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్ తాజా మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా భవిష్యత్ ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడారు. ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో చేస్తానని, జూన్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పాడు. షూటింగ్ ప్రారంభించడానికి చాలా సమయం ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనిని ప్రారంభిస్తానని ఎన్టీఆర్ చెప్పాడు. సినిమాకు సంబంధించిన లుక్స్ కోసం సమయం కేటాయిస్తానని వెల్లడించాడు. సినిమా కోసం ఎన్టీఆర్ తన బరువును తగ్గించుకోబోతున్నాడు. ఈ సినిమా లాంచ్ జూన్ లో… అంటే ఇంకా 2 నెలల సమయం ఉంది. కాబట్టి ఆలోగా NTR 30 కోసం బరువు తగ్గే పనిలో పడతాడు ఎన్టీఆర్. ప్రస్తుత ఫైనల్ స్క్రిప్ట్ గురించి ఎన్టీఆర్, కొరటాల శివ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని, అలియా భట్ కథానాయికగా నటిస్తుందని సమాచారం. అనిరుధ్ సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. “జనతా గ్యారేజ్” తర్వాత ఎన్టీఆర్, చరణ్ కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది.
