NTV Telugu Site icon

NTR: ఇంగ్లీష్ యాస పై ట్రోల్స్.. ఎన్టీఆర్ దిమ్మ తిరిగే కౌంటర్

Ntr

Ntr

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు చాలా భాషలు వచ్చు అని అందరికి తెల్సిందే. చెన్నై వెళితే తమిళ్ మాట్లాడతాడు. ముంబై వెళ్తే హిందీ, కర్ణాటకలో కన్నడ.. కేరళ వెళితే మలయాళం.. ఇక అచ్చ తెలుగు అనర్గళంగా మాట్లాడగలడు. ఇక ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును అందుకున్న విషయం తెల్సిందే. ఆ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడిన ఇంగ్లీష్ నెట్టింట వైరల్ గా మారింది. అమెరికన్ యాసలో మాట్లాడదామని ట్రై చేసి ఎన్టీఆర్ బొక్క బోర్లా పడ్డాడని, అది అమెరికన్ యాస అని ఎవరైనా అంటారా..? రాకపోతే రానట్లు ఉండాలి కానీ, ఇలా వచ్చిన్నట్లు బిల్డప్ ఇవ్వడం ఎందుకు అంటూ ట్రోలర్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
Vamsi Paidipally: ఎవడ్రా సీరియల్ ను తక్కువ చేసి మాట్లాడింది.. మీకు తెలుసా వారి కష్టం

ఇక ఈ ట్రోల్స్ కు, ట్రోలర్స్ కు ఎన్టీఆర్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఓకే ఇంగ్లిష్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ” దేశానికి ఒక్కో భాష.. ఆ భాషకు యాస ఉంటుంది. ఎవరి భాష వారిది.. ఎవరి యాస వారిది. కాలమానం, యాసల పరంగానే మన మధ్య వ్యత్యాసం ఉంటుంది. కానీ, నటుడు ఎక్కడ ఉన్నా నటుడే.. అక్కడ ఉన్న నటులు ఎలా ఉంటారో.. ఇక్కడ ఉన్నవారు కూడా అదే విధానాన్ని అవలంబిస్తాడు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. నటుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు.. ఎలాంటి భాషను మాట్లాడుతున్నాడు అనేది కాకుండా యాస బాలేదు.. అని మన తెలుగువారే ఇలా ట్రోల్ చేయడం పద్దతికాదని ఎన్టీఆర్ అభిమానులు చెప్పుకొస్తున్నారు.